NTV Telugu Site icon

Devara: వామ్మో దేవర ఏంటీ ఈ రచ్చ.. టికెట్ ముక్క కూడా మిగలలేదు.. .

Untitled Design (4)

Untitled Design (4)

యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవర. తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Also Read: Mokshagna : నందమూరి మోక్షజ్ఞ సినిమాలో స్టార్ హీరో.. ఫ్యాన్ కి పూనకాలే..?

కాగా ఓవర్శిస్ లోని కొన్నిఏరియాస్ లో బుకింగ్స్ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి. డల్లాస్ లోని XD బుకింగ్స్ ఇలా ఓపెన్ చేస్తే అలా ఫస్ట్ షో సోల్డ్ అవుట్ అయ్యాయి. టికెట్ ముక్క లేదు. దేవర U.S. ప్రీమియర్ ప్రీ-సేల్స్ ప్రారంభమవగా . $75,727 – 19లొకేషన్స్ – 52 షోస్ – 2407 టిక్కెట్లు బుక్ అయి దూసుకెళుతూ $100K దిశగా పయనిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో సినీమార్క్ సినిమాస్ మొదట స్థానంలో ఉంది, ఆపిల్ సినిమాస్ తర్వాతి స్థానంలో ఉంది. ప్రీమియర్స్ కు 27 రోజుల ముందు ఈ స్థాయి బుకింగ్స్ అంటే రిలీజ్ నాటికీ గత చిత్రాల రికార్డ్స్ ను దేవర బద్దలు కొడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనావేస్తున్నాయి. దేవరా అమెరికాలో అతిపెద్ద ఓపెనింగ్స్‌లో ఒకటిగా దూసుకుపోతున్నాడు.

Also Read :  Samantha : ఇన్‌స్టాగ్రామ్‌ లో సమంత పోస్టుపై వణికిపోతున్నటాలీవుడ్.. కారణం ఇదే..?

తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్లకు కూడా ఫుల్ డిమాండ్ ఉంటుందని తెలుస్తోంది. ఒక వైపు భారీ హైప్ మరియు అభిమానులు దాదాపు 2 సంవత్సరాల తర్వాత పెద్ద స్క్రీన్‌పై ఎన్టీఆర్‌ను చూస్తారు కాబట్టి దేవరకు ఓపెనింగ్స్ భారీగా వస్తాయని భావిస్తున్నారు టాలీవుడ్ వర్గాలు. దేవర మూడవ సింగిల్ వినక చవితి కనుకగా విడుదల చేయబోతున్నారు