బాలీవుడ్ స్టార్స్ అనగానే మనకు వారు చేసే నటన, డ్యాన్స్, స్టంట్స్… ఇలాంటివి కళ్ల ముందు కదులుతాయి. కానీ, బీ-టౌన్ హీరోలు, హీరోయిన్స్ లో మనకు కనిపించని హిడన్ టాలెంట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఓ సారి చెక్ చేసేద్దామా?
పర్ఫెక్షనిస్ట్ అంటూ అందరూ తెగ పొగిడే ఆమీర్ ఖాన్ యాక్టింగ్ సూపర్బ్ గా చేస్తాడు. అయితే, ఆయన చెస్ కూడా బాగా ఆడతాడట. విశ్వనాథన్ ఆనంద్ తో కూడా ఆమీర్ కొన్నాళ్ల కిందట చెస్ బోర్డ్ పై తలపడ్డాడు. ఇక షూటింగ్ సమయంలోనూ మిష్టర్ ఖాన్ చెస్ ఆడుతూ రిలాక్స్ అవుతాడట!
అక్షయ్ కుమార్ హీరో అవ్వక ముందు మార్షల్ ఆర్ట్స్ బాగా ప్రాక్టీస్ చేసేవాడు. అయితే, ఇప్పటికీ సూపర్ ఫిట్ గా ఉండే ఖిలాడీ కుమార్ మంచి వంటగాడు కూడా! స్టార్ అవ్వక ముందు ఆయన వృత్తి రిత్యా చెఫ్ఫే! అందుకే, ఇప్పుడు కూడా అక్షయ్ అడపాదడపా కిచెన్ లో దూరి ఘుమఘుమలాడే వంటకాలు సిద్ధం చేస్తుంటాడు…
తన అందంతో కుర్రాళ్ల గుండెల్లో గిటార్లు మోగించే గార్జియస్ బ్యూటీ కత్రీనా కైఫ్. ఈమె స్పెషల్ టాలెంట్ గిటార్ ప్లే చేయటమే! లాక్ డౌన్ సమయంలో తన టాలెంట్ కి మరింత పదును పెడుతోందట ఈ అందాల పడుచు!అమెరికాలో సెటిలైన బాలీవుడ్ దేసీగాళ్ ప్రియాంక చోప్రా మంచి పెయింటర్. ‘క్వాంటికో’ షూటింగ్ సమయంలో పీసీ పోర్ట్రెయిట్స్ తానే పెయింట్ చేసేదట!విభిన్నమైన చిత్రాలు చేసే ప్రతిభవంతుడైన రణదీప్ హూడాకి అంతే సూపర్ స్పెషల్ టాలెంట్ ఉంది. ఈయన పోలో పర్ఫెక్ట్ గా ఆడతాడట! రణదీప్ కి స్వంతంగా ఓ పోలో టీమ్ కూడా ఉండటం విశేషం!