బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 లో విడుదలైన ఈ సినిమా ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపించింది . వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయి చాలా కాలం అవుతున్నా కూడా మరో సినిమాను పట్టాలెక్కించలేదు ఈ దర్శకుడు. బలగం సినిమాను నిర్మించిన దిల్ రాజు బ్యానర్ లోనే తన రెండవ సినిమా చేయాల్సి ఉంది.
Also Read : Exclusive : నా సొంత సినిమా కాదు కదా.. నాకెందుకు
ఎప్పటి నుండో ఎల్లమ్మ అనే టైటిల్ తో ఓ కథ పట్టుకుని యంగ్ హీరోల చుట్టూ తిరిగి చివరకు హీరో నితిన్ వద్ద సినిమాను ఓకే చేయించుకున్నాడు వేణు. ప్రస్తుతం నితిన్ చేస్తున్నరాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు చివరి దశ షూట్ లో ఉన్నాయి. ఇక ఇప్పుడు వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు నితిన్. అయితే ఈ సినిమా కోసం బాలీవుడ్ మ్యూజిక్ ద్వయాన్ని దించుతున్నాడు దర్శకుడు. బాలీవుడ్ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్, అతుల్ ద్వయం ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. లేటెస్ట్ గా అందుకు సంబంధించి వర్క్ కూడా స్టార్ట్ చేసారు. ఈ నెలలో ముహూర్తం పూజ ఉండనుందట. ఏప్రిల్ లేదా మే నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. దాదాపు రెండేళ్లుగా ఈ కథ మీద కసరత్తులు చేస్తున్న వేణు ఈ సినిమాతో నితిన్ కు ఎంత పెద్ద హిట్ ఇస్తాడో చూడాలి. హీరోయిన్ గా సాయి పల్లవికోసం ట్రై చేస్తున్నారని సమాచారం.