Site icon NTV Telugu

Bollywood : బాలీవుడ్ నుంచి మరో చరిత్రాత్మక చిత్రం..

Shivajee

Shivajee

బాలీవుడ్ నుంచి ఈ ఏడాది వచ్చిన ‘ఛావా’ చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధిస్తూ ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన ‘ఛావా’ సినిమా భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో విక్కీ కౌశల్ మరాఠా యోధుడి పాత్రలో నటించి అభిమానుల మెప్పు పొంద‌గా. శంభాజీ భార్య‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పాత్రకు ప్రశంసలు దక్కాయి. అయితే ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రపై తెరకెక్కిస్తే రికార్డు వసూళ్లు వచ్చాయి. మరి అలాంటిది శివాజీ మహారాజ్ పైనే తెరకెక్కిస్తే? దాని హైప్ ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.

Also Read : Keeravani : ‘వీరమల్లు’ లో ఐటెం సాంగ్.. కానీ పవన్ ఏమన్నారంటే !

అవును బాలీవుడ్ నుంచి మరో బయోపిక్ అనౌన్స్ అయ్యింది. ‘రాజ శివాజి’ అనే ఈ చిత్రాన్ని ప్రముఖ హీరో రితేష్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహిస్తుండడం తో పాటుగా శివాజీ మహారాజ్ పాత్ర కూడా తానే పోషించనున్నాడు. ఇక తనతో పాటుగా సంజయ్ దత్ ఇంకా అభిషేక్ బచ్చన్ తదితరులు కూడా నటిస్తున్నారు. అలాగే అజయ్ – అతుల్ లు సంగీతం అందిస్తుండగా, వచ్చే ఏడాది మే 1 మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ విడుదలకు ప్లాన్ చేయనున్నారట.దీనికి సంబంధించిన పోస్టర్ వైరల్ అవుతుంది.

Exit mobile version