Site icon NTV Telugu

ఆర్ఆర్ఆర్ : ఎన్టీఆర్ కు తండ్రిగా బాలీవుడ్ హీరో ?

Bollywood Actor Ajay Devgan to play NTR’s father role in RRR?

దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న సినిమాల జాబితాలో “ఆర్ఆర్ఆర్” ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా… అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్టు షూటింగ్ కు ఇప్పటికే అడ్డంకులు ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి రోజుకో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది.

Read Also : పాపులర్ షో కోసం ఎన్టీఆర్ టెస్ట్ లుక్ ?

తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయమేమంటే… అజయ్ దేవ్‌గన్ ఒక స్వాతంత్య్ర సమరయోధుడుగా కన్పించబోతున్నారు. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే అజయ్ ఎన్‌టిఆర్ తండ్రి పాత్ర పోషిస్తున్నారట. ఇందులో నిజమెంతో తెలీదు కానీ ఈ వార్తలు మాత్రం సినిమాపై మరింత ఆతృతను రేకెత్తిస్తున్నాయి. ఇక ఇప్పటికే ప్రధాన సన్నివేశాలు షూటింగ్ పూర్తవ్వగా… మిగిలిన షెడ్యూల్ కోసం రీసెంట్ గా షూటింగ్ ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లోనే చ‌ర‌ణ్, ఎన్టీఆర్ లపై ఓ సాంగ్ షూట్ చేయ‌నున్నారని సమాచారం. వీలైనంత తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసి కొత్త విడుదల తేదీని ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నారు.

Exit mobile version