NTV Telugu Site icon

Bolisetty Srinu: అల్లు అర్జున్ పై వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం.. ఒక మెగా అభిమానిగా మాత్రమే స్పందించా!

Bolisetti Srinivas

Bolisetti Srinivas

Bolisetti Srinivas Clarity on Comments against Allu Arjun: అల్లు అర్జున్ ఏమైనా పుడింగా? మాటలు జాగ్రత్తగా రావాలి అంటూ అనూహ్య వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చిన తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా ఆ విషయం మీద మరోసారి స్పందించారు. నాకు ఇష్టమైతేనే వస్తా, ఒక మెగా అభిమానిగా చిరంజీవి గారిని గాని నాగబాబు గారిని గాని పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరైనా సరే గౌరవం లేకుండా మాట్లాడితే నేను వస్తా, గతాన్ని మర్చిపోయి మాట్లాడితే కచ్చితంగా వస్తానని ఆయన కామెంట్ చేశారు. మరి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే నా వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం, ఒక మెగా అభిమానిగా మాత్రమే నేను స్పందించా, గమనించగలరు అంటూ ఆయన పోస్ట్ చేశారు.

Vijay Party: హీరో విజయ్ కి బిఎస్పి షాక్

ఒక సోషల్ మీడియా హ్యాండిల్ లో అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తున్నారు అంటూ పేర్కొన్న నేపథ్యంలో దానికి కౌంటర్ ఇస్తూ బొలిశెట్టి శ్రీనివాస్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇటీవల జరిగిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ లో తనకు ఇష్టమైతేనే వస్తానని అంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యల మీద ఇంత చర్చ జరుగుతోంది. ఆయన పరోక్షంగా శిల్పా రవిచంద్ర రెడ్డి వ్యవహారం గురించి మాట్లాడారనే చర్చల నేపథ్యంలో మరోసారి అల్లు వర్సెస్ మెగా కుంపటి రాజుకుంది. అయితే ఇప్పటివరకు అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ కేవలం అభిమానులు మాత్రమే స్పందిస్తూ వచ్చారు. కానీ ఒక జనసేన ఎమ్మెల్యే ఈ స్థాయిలో స్పందించడంతో ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show comments