NTV Telugu Site icon

Bobby Simha: చిన్నప్పటి లెక్కల మాస్టర్’ని కలిసిన స్టార్ యాక్టర్

Mopidevi

Mopidevi

మా టీచర్‌ నర్రా రాంబాబు లెక్కలతో గేమ్స్‌ ఆడేవారు అని స్టార్ యాక్టర్ బాబి సింహా అన్నారు. తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉండే ప్రముఖ నటుడు సోమవారం మోపిదేవిలో ప్రముఖ మ్యాథ్స్‌ టీచర్‌ నర్రా రాంబాబుని గౌరవపూర్వకంగా కృష్ణాజిల్లా మోపిదేవిలో కలిశారు. ఆయన్ను కలిసిన తర్వాత బాబిసింహా ఎమోషనల్‌ అయ్యారు. ఈ క్రమంలో సింహా ‘మాట్లాడుతూ అమ్మా,నాన్నల తర్వాత మనం పూజించేది గురువులనే.

Home Town: 90స్ నిర్మాతల నుంచి ‘హోం టౌన్’.. టీజర్ భలే ఉందే!

నాకు అలాంటి గురువు నార్ర రాంబాబుగారు. ఆయన మాకు పాఠాలతో పాటు లైఫ్‌లో ఎలా నడుచుకోవాలో కూడా నేర్పించారు. ఆయన నేర్పిన డిసిప్లీన్‌ వల్లే నా జర్నీ ఇంత సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుంది. 29 సంవత్సరాల తర్వాత ఆయన్ని కలిసి మాట్లాడి తన యోగక్షేమాలు కనుక్కున్నాను. ఆయన్ని కలిసిన తర్వాత వ్యక్తిగతంగా నేను ఎంతో ఎమోషన ల్‌గా ఫీలయ్యానో మీ అందరితో పంచుకోవాలి అనిపించింది’’ అన్నారు.