Site icon NTV Telugu

Black Dog Telugu Movie: ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ సినిమా టీజర్ కి విశేషాదరణ

Chandrahas

Chandrahas

Black Dog Telugu Movie: బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ ను హీరోగా పరిచయం చేస్తూ పికెఎకె ఫిలిమ్స్ నిర్మిస్తున్న సినిమాకు ‘బ్లాక్ డాగ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇటీవల తన పరిచయం గురించి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన బాడీ లాంగ్వేజ్ విషయంలో విపరీతంగా ట్రోల్ కి గురయ్యాడు చంద్రహాస్. అయితే పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదన్నట్లు ఓ విధంగా ట్రోల్స్ కూడా మంచిదే అని ప్రభాకర్ పాజిటీవ్ గా తీసుకుని సినిమా రిలీజ్ అయిన తర్వాత తన కుమారుడు నటన బాగుంటే ఆటోమేటిక్ గా ట్రోలర్స్ కూడా అభినందిస్తారనే అభిప్రాయాన్ని ఎన్టీవీ ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు. దానికి తగ్గట్లుగానే చంద్రహాస్ సినిమా టీజర్ ను విజయదశమి కానుకగా విడుదల చేయగా రెండు రోజుల్లో దాదాపు మూడున్నర లక్షల వ్యూస్ ను సంపాదించింది. స్టార్స్ సినిమాల టీజర్స్ కే వ్యూస్ కొంటున్న రోజుల్లో ఇలాంటి స్పందన నిజంగా అభినందించదగ్గ విషయమే.

దీనికి ముందు చంద్రహాస్ ‘ఆర్ఆర్ఆర్’లో నాటు నాటు సాంగ్ రీ క్రియేట్ చేయగా దాదాపు 20 లక్షల వ్యూస్ ని కొల్లగొట్టాడు. ఇక తన సినిమా టీజర్ విషయానికి వస్తే పరిచయాన్ని కూడా అట్టిట్యూడ్ స్టార్ అని వేయటంలోనే స్పోర్టీవ్ నెస్ కనిపిస్తోంది. టీజర్ లో కూడా ‘మన ఎంట్రీ గురించి కంట్రీ మొత్తం మాట్లాడాలని అల్లా కొట్టినా…’ అనే డైలాగ్ పెట్టడాన్ని కూడా ట్రోలింగ్ ను ఎంత పాజిటీవ్ గా తీసుకున్నారో అర్థం అవుతోంది. ‘నాటు నాటు’ పాటలో తన డాన్సింగ్ స్కిల్స్ చూపించిన చంద్రహాస్ ఈ టీజర్ లో తనలో యాక్షన్ యాంగిల్ ని ఆవిష్కరించాడు. ఏది ఏమైనా ‘బ్లాక్ డాగ్’ ఫర్ ‘వైట్ చిక్’ అంటూ ఆడియన్స్ ముందుకు వస్తున్న ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ ఆడియన్స్ ను ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూద్దాం.

https://www.youtube.com/watch?v=d_uX44RFlbc

Exit mobile version