అదిత్ అరుణ్ కు బర్త్ డే విషెస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జెనీలియా నాయికగా నటించిన కథ చిత్రంతో 2009లో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అదిత్ అరుణ్. అప్పటి నుండీ రొటీన్ కు భిన్నమైన కథలనే ఎంపిక చేసుకుంటూ ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాలలో నటిస్తున్నాడు. వీకెండ్ లవ్, తుంగభద్ర, గరుడవేగ చిత్రాలతో పాటు 24 కిసెస్, చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాలతో కుర్రకారుకూ దగ్గరయ్యాడు ఈ యంగ్ హీరో. మన ముగ్గురి లవ్ స్టోరీ, లెవన్త్ అవర్ వంటి తెలుగు వెబ్ సీరిస్ లలోనూ నటించాడు. జూన్ 8 అదిత్ అరుణ్ జన్మదినం. ఈ సందర్భంగా అతను నటిస్తున్న సినిమాల దర్శక నిర్మాతలు బర్త్ డే విషెస్ తెలియచేశారు. ఇందులో ఒకటైనడియర్ మేఘ చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. మేఘా ఆకాశ్ నాయికగా నటిస్తున్న ఈ సినిమాను అరుణ్ దాస్యన్ నిర్మిస్తుండగా సుశాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. అలానే కె.వి. గుహన్ దర్శకత్వంలో అదిత్ అరుణ్ డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో రాజశేఖర్ కుమార్తె శివానీ నాయికగా నటిస్తోంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీని రవి పి రాజు దాట్ల నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర యూనిట్ సైతం అరుణ్ అదిత్ బర్త్ డే సందర్భంగా విషెస్ తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. అలానే అదిత్, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న కథ కంచికి మనం ఇంటికి మూవీ యూనిట్ సైతం మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని చాణక్య చిన్న దర్శకత్వంలో మోనిష్ పత్తిపాటి నిర్మిస్తున్నాడు. మొత్తానికీ ఈ సినిమాలన్నీ కూడా థియేటర్ల ఓపెన్ కాగానే వరుసగా సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి.
Also Read
- Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
- August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
- 'Raaka' Glimpse: 'రాకా' ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
- Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
తాజావార్తలు
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!