తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సోనియా గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలంగాణలోని మంథనికి చెందిన ఆమె, యాంకర్‌గా, ఆర్జీవీ నుండి సినిమాల్లో నటిగా మారింది. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, కొన్ని కారణాల వల్ల తొందరగా ఎలిమినేట్ అయినప్పటికీ, తన వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. బిగ్‌బాస్ సీజన్ 8లోకి ఎంటర్ అయిన సమయంలోనే సోనియా తన ప్రియుడు యశ్ గురించి చెప్పింది. షో పూర్తయ్యాక కొద్ది నెలల్లోనే వీరి వివాహం, డిసెంబర్ 2022లో జైపూర్‌లో ఘణంగా జరిగింది. ఇక ఇప్పుడు తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. ఏడాదికి లోపే తాము తల్లిదండ్రులు కాబోతున్నాం అని తెలిపింది.
Also Read : SSMB 29 : కొత్త షెడ్యూల్ లొకేషన్ ఫిక్స్ !
ఇటీవలే సోషల్ మీడియా ద్వారా తాను గర్భవతినని ప్రకటించి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ శుభవార్తను ఓ స్పెషల్ ప్రాజెక్ట్ ద్వారా తన భర్త యశ్‌వీర్ గ్రోనికి తెలియజేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పెళ్లైన కొద్దికాలానికే ఈ శుభ వార్తను అభిమానులతో పంచుకున్న సోనియా – తన సంతోషాన్ని అందరికీ తెలియజేశారు. ఈ శుభవార్త విన్న అభిమానులు సోనియా-యశ్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. ‘మీ జీవితంలో ఇది కొత్త ఛాప్టర్, కొత్త హ్యాపీనెస్ – మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
