గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు.
Also Read : Cinema Race : రాబోయే నాలుగు నెలల్లో ఇండియన్ సినిమాలకు మేజర్ టెస్ట్
మరోవైపు ఈ సినిమా షూటింగ్ ను చక చక చేసేస్తున్నారు. కొంత కాలంగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ మధ్య యాక్షన్ సీన్స్ ఫినిష్ చేసారు. అలాగే ఈ చిత్రంలోని రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోందట. ఆ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు బుచ్చి. రామ్ – లక్ష్మణ్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ భారీ ఫైట్ విజువల్ ఫీస్ట్ గా ఉండబోతుందని సమాచారం. పెద్ది విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీగా నిర్మిస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను మైసూరులో చేస్తున్నారు. భారీ సెట్స్ మధ్య చేస్తున్న ఈ షెడ్యూల్ లో చరణ్ ఇంట్రో సాంగ్ ను షూట్ చేస్తున్నారు. ఈ సెట్‌లో 1000+ మందికి పైగా నృత్యకారులు మరియు జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో, ఈ పాట అద్భుతమైన విజువల్స్ తో సినిమాలో కీలకమైన హైలైట్‌లలో ఒకటిగా ఉండబోతోందట.
. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న పెద్ది 2026 మార్చి 27 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.
