Site icon NTV Telugu

Release postpone : మరోసారి రిలీజ్ వాయిదా పడిన భారీ బడ్జెట్ సినిమా

Ghaati

Ghaati

టాలీవుడ్ క్వీన్ అనుష్క నటిస్తున్న సినిమా ఘాటీ. ‘బాహుబలి’ సక్సెస్ తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తుంది అనుష్క. ముఖ్యంగా లేడి ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువ చేస్తూ వచ్చింది. భాగమతి సూపర్ హిట్ కాగా నిశ్శబ్దం ఫ్లాప్ అయింది. ఇక నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తో హీరోయిన్ గా హిట్ అందుకుంది. ఇప్పుడు మరల కాస్త గ్యాప్ ఇచ్చి మరోసారి లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది స్వీటి.

Also Read : Telugu Rights : రజినీకాంత్ ని మించిన జూనియర్ ఎన్టీఆర్

గతంలో తనకు వేదం వంటి హిట్ ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో మరోసారి నటిస్తుంది అనుష్క. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికి ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకుంది. కాగా ఈ సినిమాను ఏప్రిల్ 18న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసారు మేకర్స్. కానీ షూట్ డిలే కారణంగా వాయిదా పడింది. అదే టైమ్ లో జులై 11న రిలీజ్ చేస్తామని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. అందుకు తగ్గట్టే షూటింగ్ కూడా ఫినిష్ చేసారు. ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన డేట్ కు వస్తామని తెలిపారు మేకర్స్. కానీ యూనిట్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం  సిజి పనులు పూర్తి కాలేదని ఇంకా పెండింగ్  ఉన్నాయని రిలీజ్ లోపు ఫినిష్ అవడం కుదరదని తెలిసింది. రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందని అందుకు సంబంధించి అధికారక ప్రకటన త్వరలోనే వస్తుందని తెలిపాయి. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఘాటీ నెక్ట్స్ రిలీజ్ ఎప్పుడో ఉంటుందో.

Exit mobile version