Site icon NTV Telugu

Nani: నాని ఇంత చీప్ పని చేస్తావా.. నిర్మాత ఫైర్!

Nani

Nani

కన్నడ సినీ నిర్మాత ఒకరు నేచురల్ స్టార్ నాని మీద తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తాను నిర్మించిన భీమసేన నలమహారాజా అనే సినిమాని కాపీ కొట్టారంటూ నాని మీద ఆరోపణలు చేశారు సదరు నిర్మాత. పుష్కర మల్లికార్జునయ్య అనే నిర్మాత కన్నడలో పలు సినిమాలు నిర్మించారు. వాటిలో రక్షిత్ శెట్టి హీరోగా నటించిన అవనే శ్రీమన్నారాయణ తెలుగులో అతడే శ్రీమన్నారాయణగా కూడా రిలీజ్ అయింది. ఆ తర్వాత ఆయన అరవింద్ అయ్యర్ హీరోగా భీమసేన నలమహారాజు అనే సినిమా చేశారు. ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు తర్వాతి కాలంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా రిలీజ్ అయింది. అయితే అదే సినిమా రీమేక్ రైట్స్ తీసుకోకుండా హాయ్ నాన్న అనే సినిమాగా చేశారంటూ ఆయన ఫైర్ అయ్యాడు.

Thandel: తండేల్ సెన్సార్ టాక్.. దుల్లగొట్టేయడం ఖాయమట!

ఇంతకన్నా చీపు పని ఇంకోటి ఉంటుందా నాని అంటూ నేచురల్ స్టార్ నానిని ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో టాగ్ చేసి ప్రశ్నించారు. అయితే నిజానికి హాయ్ నాన్న సినిమా రిలీజ్ కి ముందు ఈ సినిమా తమిళ హీరో కవిన్ నటించిన దాదా అనే సినిమాకి రీమేక్ అనే ప్రచారం జరిగింది. ఎందుకంటే హాయ్ నాన్న పోస్టర్స్ తో పాటు ప్రమోషనల్ కంటెంట్ దాదా సినిమాని పోలి ఉండడంతో ఆ సినిమా రీమేక్ అని అందరూ అనుకున్నారు. కానీ అప్పట్లో అది నిజం కాదని నాని అలాగే టీం తోసిపుచ్చింది. ఇప్పుడు ఏకంగా నాని సహా టీం మీద కన్నడ నిర్మాత ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

Exit mobile version