Site icon NTV Telugu

మెహ్రీన్ తో పెళ్లి రద్దుపై స్పందించిన భవ్య బిష్ణోయ్‌

టాలీవుడ్ హీరోయిన్‌ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హరియాణా మాజీ సీఎం భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనువడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి రద్దు చేసుకున్నానని తెలపడంతో అభిమానులంతా షాక్‌ కు గురైయ్యారు. దీంతో సోషల్‌ మీడియాలో ఆమె ఫ్యాన్స్ భవ్య బిష్ణోయ్‌, అతని కుటుంబానికి వ్యతిరేకంగా ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఆ కుటుంబాన్ని నిందిస్తూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేకాదు, భవ్య బిష్ణోయ్‌ కుటుంబం రాజకీయ నేపథ్యం వున్నా కుటుంబం కావడంతో హేళన చేస్తూ ఇతర పార్టీల కార్యకర్తలు కూడా కామెంట్స్ చేశారు. దీంతో భవ్య బిష్ణోయ్‌ సీరియస్ అయ్యారు. పెళ్లి రద్దుపై వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు, మా కుటుంబంపై ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ భవ్య బిష్ణోయ్‌ హెచ్చరించాడు.

Exit mobile version