Site icon NTV Telugu

Bharti Singh : మీద పడేవారు.. టచ్ చేసేవారు – కమెడియన్ భారతి షాకింగ్ కామెంట్స్

Bharathi Singh

Bharathi Singh

ప్రేక్షకు‌ల్ని ఎప్పుడూ నవ్వించే కమెడియన్, హోస్ట్ భారతి సింగ్ ఈ మధ్య ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. ఎప్పుడూ సరదాగా కనిపించే ఈ కమెడియన్ వెనుక ఒకప్పు‌డు ఎంత కష్టాలు, ఎంత ఇబ్బందులు ఉన్నాయో ఆమె చెప్పిన మాటల్లో తేలుస్తున్నాయి. తన కెరీర్ ప్రారంభ దశలో తాను ఎదుర్కొన్న సమస్యలను భారతి ఓపెన్‌గా బయటపెట్టింది.

Also Read : Disco Shanti : సొంతవాళ్లే మోసం చేశారు.. తిండికి కూడా కష్టమైంది – డిస్కో శాంతి ఎమోషనల్

“ఈ రోజుల్లో మనందరికీ గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంటే ఏంటో తెలుసు. కానీ నా చిన్నప్పుడు అది తెలియదు. నా దగ్గర డబ్బులు లేని రోజుల్లో, ఉదయం ఐదు గంటల బస్సు ఎక్కి కాలేజీలో కామెడీ స్కి‌ట్స్ నేర్పించడానికి వెళ్లేదాన్ని. ఆ బస్సులో ఎక్కువ‌గా పాలు అమ్మే వాళ్ళు ఉండేవారు. కొన్నిసార్లు వారు నాపై పడిపోవడం, ఎక్కడో తాకడం జరిగేది. అప్పుడు నాకది అర్థం కాలేదు. కానీ ఒకసారి ఎవరో నన్ను గట్టిగా పట్టుకున్నప్పుడు ఏదో తేడాగా అనిపించింది. వారు కిందపడుతూ తప్పు జరిగిందేమో అనుకున్నా. ఏడాదిన్నర పాటు నిజంగా నన్ను అసభ్యంగా తాకుతున్నారని గుర్తించలేదు’’ అని షాకింగ్ విషయం బయట పెట్టింది. ఆ తర్వాత ధైర్యంగా ఎదురు నిలిచినట్లు చెప్పింది భారతి..

“ఆ తర్వాత నాకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ స్పష్టంగా అర్థమైంది. అప్పుడు నాలోని భారతి మేల్కొని చాలా మందికి గుణపాఠం చెప్పా. నాకంటే పొడవుగా ఉన్న అబ్బాయిలకే చెంపదెబ్బలు కొట్టాను. మొదట్లో నా చేతులు వణికేవి, కానీ తర్వాత నేను బలంగా మారాను” అని స్పష్టం చేసింది. ఈ కఠిన అనుభవాలు దాటుకుని, తన టాలెంట్‌తో పరిశ్రమలో నిలబడిన భారతి సింగ్ ఈ రోజుని వరకు మంచి పేరు సంపాదించుకుంది.

Exit mobile version