NTV Telugu Site icon

Kalki 2898 AD : బుజ్జి తో భైరవ మాస్ ఎంట్రీ అదిరిపోయిందిగా…

Bhairava

Bhairava

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్,లోకనాయకుడు కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అలాగే ఈమూవీ లో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ గ్లింప్సె వీడియో సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

Read Also :Manam Re-Release : “మనం” మాకెంతో స్పెషల్ మూవీ..నాగార్జున స్పెషల్ వీడియో వైరల్..

ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ బుజ్జి గురించి మేకర్స్ ఇటీవల రివీల్ చేసారు.ఈ సినిమాలో బుజ్జి అనేది ఓ రోబోటిక్ కార్.. ఈ బుజ్జి కల్కి లోని భైరవకు ప్రాణ మిత్రుడు..ఈ బుజ్జికి మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.ఇదిలా ఉంటే నేడు బుజ్జిని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు మేకర్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.బుజ్జి ఎంట్రీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రేక్షకులు అరుపులు,క్లాప్స్ ,విజిల్స్ మధ్య భైరవ బుజ్జితో మాస్ ఎంట్రీ ఇచ్చాడు.నీ టైం వచ్చేసింది బుజ్జి అంటూ ప్రభాస్ రోబోటిక్ కార్ తో దూసుకు వచ్చాడు.అనంతరం బుజ్జిని ఫ్యాన్స్ కు పరిచయం చేసాడు.

Show comments