NTV Telugu Site icon

Bhairava Anthem : ఎట్టకేలకు ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..

Bhairava Anthem

Bhairava Anthem

Bhairava Anthem: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరాకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ ముఖ్య పాత్రలలో నటించారు.ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ గా వుంది.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది..

Read Also :NTR :దేవర షూటింగ్ కు ఫ్యామిలీ తో ఎన్టీఆర్.. పిక్స్ వైరల్..

కల్కి 2898AD సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. నిన్న కల్కి సినిమా నుంచి భైరవ యాంథం అంటూ పంజాబీ స్టైల్ లో ఉండే ఓ పాటని విడుదల చేసారు. అయితే నిన్న కేవలం ఆడియో సాంగ్ ను మాత్రమే మేకర్స్ రిలీజ్ చేసారు.ఫుల్ వీడియో సాంగ్ ను నేడు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీడియో సాంగ్ రాకపోవడంతో ప్రేక్షకులను అసహనానికి గురయ్యారు.కానీ ఈ సాంగ్ కోసం టీం ఎంతగానో కష్టపడింది. ప్రేక్షకుల ఎదురుచూపులు తెర దించుతూ కల్కి భైరవ యాంథం వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించగా పంజాబీ సింగర్ దిల్జీత్ దోసంజ్ తో ఈ పాటను పాడించారు. ఈ వీడియోలో దిల్జీత్ దోసంజ్ తో పాటు ప్రభాస్ కూడా స్టైలిష్ గా కనిపించి ఎంతగానో అలరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Show comments