NTV Telugu Site icon

Bhagyashri Borse: ఎంతవారైనా “కాంత”దాసులే.. భలే ఛాన్స్ పట్టిందే!

Bhagyashri Borse

Bhagyashri Borse

Bhagyashri Borse Roped in For Dulquer Salmaan’s Multi-lingual Film Kaantha: మరాఠీ భామ భాగ్యశ్రీ తెలుగులో మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి మంచి పేరు తెచ్చి పెడుతుంది అనుకుంటే దారుణమైన డిజాస్టర్ గా నిలిచి ఏమాత్రం వర్కౌట్ కాలేదు. అయితే సినిమా వర్కౌట్ కాకపోయినా ఆమెకు మాత్రం వరుస అవకాశాలు లభించడం ఖాయమని అందరూ అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆమెకు ఒక భారీ బంపర్ ఆఫర్ తగిలినట్టు అయింది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్‌ కొలాబరేషన్లో మోస్ట్ ఎవైటెడ్ మల్టీ లింగ్వల్ ప్రాజెక్ట్ “కాంత” హైదరాబాద్‌లోని రామా నాయుడు స్టూడియోస్‌లో నిన్న పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. విక్టరీ వెంకటేష్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కు జోడిగా భాగ్యశ్రీ ఎంపికైంది. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ కూడా ఈరోజు ప్రారంభమౌతోంది. ఒకరకంగా భాగ్యశ్రీ ప్రస్తుత పరిస్థితికి ఇది ఒక లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి.

Tollywood : సోమవారం టాలీవుడ్ సూపర్ -8 స్పెషల్ న్యూస్…

తెలుగు బేస్ తో తెరకెక్కుతున్నా దుల్కర్ సల్మాన్ హీరో కాబట్టి పాన్ ఇండియా అప్పీల్ వచ్చేస్తుంది. కాబట్టి ఆమెకు తమిళ, మలయాళ, కన్నడ మార్కెట్ కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక 1950 మద్రాస్‌ బ్యాక్ డ్రాప్ లో హ్యూమన్ రిలేషన్స్, సోషల్ చైంజెస్ ని ఎక్స్ ఫ్లోర్ చేసే గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ గా ఈ సినిమా ఉండబోతోందని అంటున్నారు. ఇక రానా దగ్గుబాటి మాట్లాడుతూ..కాంత కోసం వేఫేరర్ ఫిల్మ్స్‌తో భాగస్వామ్యం కావడం ఈ ప్రాజెక్ట్‌కి కొత్త డైమెన్షన్ ని యాడ్ చేసింది, క్యాలిటీ సినిమా పట్ల మా విజన్ ఒకేలా ఉంటుంది. సురేష్ ప్రొడక్షన్స్ 60వ యానివర్సరీ పురస్కరించుకుని, స్పిరిట్ మీడియాతో కొత్త శకానికి నాంది పలికేందుకు పర్ఫెక్ట్ మూవీ ‘కాంత” అన్నారు. ప్రశాంత్ పొట్లూరి, రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ , జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టెక్నికల్ గా టాప్ లెవల్ లో ఉండబోతోంది. డాని సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈసినిమాకి జాను సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. త్వరలోనే ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు మేకర్స్.

Show comments