bhagyashree borse pair with dulquer salmaan: గతంలో పరశురామ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గ పనిచేసిన రవి దర్శకుడిగా దుల్కర్ సల్మాన్ హీరోగా చేయబోతున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈ మూవీ లో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుందని ఆమె దానికి అగ్రిమెంట్ కూడా చేసింది అని చెప్పుకొచ్చారు. ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు దుల్కర్ సల్మాన్ మరొక లక్కీ చాన్స్ కొట్టేసింది.
Also Read; Kalki 2898 AD : కల్కి ట్రైలర్ అదిరింది..దీపికా పాత్ర డబ్బింగ్ పై ట్రోల్స్..
ఇక ఈ చిత్రం కాకుండా భాగ్యశ్రీకి మరో ఆఫర్ కూడా దక్కినట్లు తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలో భాగ్యశ్రీని తీసుకోబోతున్నట్లుగా టాక్ ఉంది.అలానే సుజీత్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని ఇటీవల ఓ సినిమా ప్రకటించారు. ఈ చిత్రంలో కూడా భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్‌గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయట. అన్నీ కుదిరితే నాని-సుజీత్ సినిమా ఛాన్స్ కూడా ఈ బ్యూటీ దక్కించుకునే అవకాశం ఉంది. ఇలా డెబ్యూ సినిమా రిలీజ్ కాకుండానే టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది ఈ బ్యూటీ.
ఇక ఏ సినిమా అమెరికా నేపథ్యంలో సాగే సమకాలీన ప్రేమకథా చిత్రంగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం కానుందని, దుల్కర్ సల్మాన్ ఇతర చిత్రాల మాదిరిగానే ఇది కూడా పాన్-ఇండియా విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.