Bethlehem Kudumba Unit : ‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు విడుదలకు అడ్డంకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నివిన్ పౌలీ హీరోగా మమిత బైజు హీరోయిన్ గా వచ్చిన మలయాళ బ్లాక్ బస్టర్ బెత్లెహం కుడుంబ యూనిట్. కేరళంలో ఓనమ్ కానుకగా రిలీజైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ దిశగా వెళ్తోంది. మరికొన్ని గంటల్లో ‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ ఈసినిమాకు ఊహించని చిక్కులు ఎదురయ్యాయి. మలయాళంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు పూర్తి చేసినప్పటికీ, ప్రస్తుతం థియేట్రికల్ స్క్రీనింగ్ విషయంలో డిస్ట్రిబ్యూటర్లకు గట్టి షాక్ తగిలింది.
ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విండో (తక్కువ సమయంలోనే ఓటీటీలోకి రావడం) కారణాన్ని చూపుతూ ప్రముఖ మల్టీప్లెక్స్ నెట్‌వర్క్‌లు తమ స్క్రీన్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించడానికి తిరస్కరించాయి. థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల్లోనే డిజిటల్ ప్లాట్ఫామ్లలోకి వచ్చే సినిమాలకు మల్టీప్లెక్స్‌లు స్క్రీన్లు కేటాయించకూడదనే నిబంధనను ఈ చిత్రానికి వర్తింపజేశారు. దీనివల్ల ఈ తెలుగు వెర్షన్‌కు ప్రముఖ మల్టీప్లెక్స్ థియేటర్ల మద్దతు లభించలేదు. ఈ పరిణామాల కారణంగా ‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు వెర్షన్ కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రమే ప్రదర్శించబడనుంది. కేరళం బయట ఫహద్, నివిన్ పౌలి వంటి ఇద్దరు స్టార్ హీరోలు ఎంతో ఆసక్తితో ప్రమోషన్స్ నిర్వహిస్తున్న ఏకైక ప్రాజెక్ట్ కావడంతో, మల్టీప్లెక్స్‌లు దూరం కావడం కొంత నిరాశపరిచే విషయమే. అయినప్పటికీ సింగిల్ స్క్రీన్స్ వేదికగా ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.
Also Read
- Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
- KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
తాజావార్తలు
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
-
Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!