టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్..అల్లుడు శీను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ఆ తరువాత వరుస సినిమాలు చేసిన సాయి శ్రీనివాస్ తన కెరీర్ లో హిట్లు మరియు ఫ్లాప్స్ చూశారు. రీసెంట్ గా ఛత్రపతి హిందీ రీమేక్ ఫ్లాప్ కావడంతో సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ప్లాన్స్ ప్రస్తుతానికి ఆగిపోయాయి. కాస్త బ్రేక్ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ మరో రెండేళ్ల పాటు వరుస సినిమాలను లైన్ లో పెట్టి దూసుకుపోతున్నాడు.
ఈ యంగ్ హీరో తాజాగా సాగర్ చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.అలాగే కౌశిక్ దర్శకత్వంలో “కిష్కిందపురి” అనే సినిమాకు సంతకం చేయగా, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.ఇదిలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే ఓ బిగ్గెస్ట్ మూవీలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు.దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా బైరెడ్డి దర్శకుడిగా పరిచయం కానున్నారు .అయితే ఈ చిత్రం స్క్రిప్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ కు నచ్చడంతో చిత్ర బృందం ప్రీ ప్రొడ క్ష న్ కార్యక్రమాలు జరిపింది. ఈ సినిమాను ప్రారంభించడానికి సరైన నిర్మాణ సంస్థ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు.ఇటీవలే సాయి శ్రీనివాస్ షైన్ స్క్రీన్స్ మరియు మూన్ షైన్ పిక్చర్స్ సంస్థలలో చిత్రాలు చేసందుకు సైన్ చేశాడు.తాజాగా ఓ నిర్మాణ సంస్థ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది జూలైలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుండగా బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రానుంది.
