టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నాడు. పెన్ స్టూడియోస్ నిర్మాణంలో వి.వి.వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ రీమేక్ రాక్షసుడు అనంతరం ప్రస్తుతం బెల్లంకొండ చేస్తోన్న రీమేక్ చిత్రం ఇది. హీరోయిన్ గా అనన్య పాండే ఈ సినిమాలో నటించనుందని సమాచారం. అయితే ఈ సినిమా తర్వాత మరోసారి రీమేక్ సినిమానే చేయనున్నాడని తెలుస్తోంది. తమిళంలో ధనుష్ నటించిన ‘కర్ణన్’ సినిమాని శ్రీనివాస్ త్వరలో తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బెల్లంకొండ సురేష్ ఈ సినిమాపై హక్కులు కొన్నారని సమాచారం. దీంతో ఈ సినిమా తెలుగు రీమేక్ పక్కాగా ఉండే అవకాశం ఉందని టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది.
మరో రీమేక్‌తో బెల్లంకొండ!
