Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్

Bellamkonda Marriage

Bellamkonda Marriage

బెల్లంకొండ వారసుడి పెళ్లి బాజా మోగనుంది, టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. వేద మంత్రాల సాక్షిగా అత్యంత వైభవంగా ఈ వివాహ వేడుక జరగనుంది. కావ్య అనే యువతితో శ్రీనివాస్ ఏడడుగులు వేయబోతున్నారు. వీరి వివాహ వేడుకకు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల వేదిక కానుంది. సనాతన ధర్మ సంప్రదాయాల ప్రకారం, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ వివాహం అత్యంత పవిత్రంగా జరగనుంది. ఏప్రిల్ 29వ తేదీ రాత్రి 11:13 గంటలకు తిరుమలలో శ్రీనివాస్-కావ్యల కల్యాణ మహోత్సవం జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు.

తిరుమలలో పెళ్లి ముగిసిన అనంతరం, నూతన వధూవరుల కోసం హైదరాబాద్‌లో భారీ స్థాయిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మే 1వ తేదీన జరగనున్న ఈ విందు వేడుకకు టాలీవుడ్ టాప్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు హాజరుకానున్నారు. పలువురు రాజకీయ నేతలు, విఐపిలు ఈ వేడుకలో సందడి చేయనున్నారు. అలానే బెల్లంకొండ కుటుంబానికి అత్యంత ఆత్మీయులు విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించనున్నారు. #SrinivasaKavyanam అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ఈ పెళ్లి వార్త సందడి చేస్తోంది. ఈ యువ జంటకు నెటిజన్లు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.