Site icon NTV Telugu

Neelakhi: ‘బ్యూటీ’ నటి నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డు

Neelakhi

Neelakhi

‘బ్యూటీ’ అనే చిత్రంతో నీలఖి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను గీతా సుబ్రమణ్యం మరియు ‘హలో వరల్డ్’ ఫేమ్ వర్ధన్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య హీరోగా, నీలఖి కథానాయికగా నటించారు. నీలఖి తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టకముందే ఒడిశాలో తన ప్రతిభను చాటుతున్నారు. ఒడిశాలోని ప్రముఖ టీవీ ఛానల్ తరంగ్ టీవీ నిర్వహించిన తరంగ్ సినీ ఉత్సవ్‌లో ‘యంగ్ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ – డెబ్యూ ఫీమేల్’ విభాగంలో నీలఖికి అవార్డు లభించింది. తెలుగు ప్రేక్షకులను కూడా తన నటనతో ఆకట్టుకుంటారని ‘బ్యూటీ’ బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ChiruAnil: ఆ రోజు చిరంజీవి – అనిల్ రావిపూడి చిత్రం పూజా కార్యక్రమం!

ఇప్పటికే విడుదలైన ‘బ్యూటీ’ పోస్టర్లు, టీజర్‌లో నీలఖి తన అందం మరియు అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె భావోద్వేగాలను పండించడంలో చక్కటి నైపుణ్యం కనబరిచారని టీమ్ గతంలోనే వెల్లడించింది. ‘బ్యూటీ’ చిత్రంతో నీలఖి తెలుగు తెరపైకి ఘనంగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. వానరా సెల్యులాయిడ్ బ్యానర్‌పై మారుతి టీమ్‌తో కలిసి జీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి అడిదాల విజయపాల్ రెడ్డి మరియు ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version