కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి ఆందోళకు గురి చేస్తోంది. దేశంలో రోజురోజుకూ కరోనా బారిన పడ్డ వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ కరోనా మహమ్మారి ప్రజలను మరోసారి భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే పలు సినిమాల షూటింగ్, విడుదలలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. క్రమంగా కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో సినీ ప్రముఖులు సైతం తమ అభిమానులు, ప్రజలకు సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఎక్సెప్షనల్ టైములో ఎక్స్ట్రా ఆర్డినరీ మెజర్స్ అవసరం. మాస్క్ ధరించండి, శానిటైజర్ ఉపయోగించండి. ఇంట్లోనే ఉండండి. జాగ్రత్తగా ఉండండి. మీ వంతు వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ వేయించుకోండి. మేము కూడా అదే చేస్తున్నాం. బాధ్యతగల సిటిజెన్ గా ఉండండి’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు కరోనాను అరికట్టడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ను విధించిన విషయం తెలిసిందే. ఈరోజు రాత్రి నుంచి మే 1 వ తేదీ వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
బాధ్యతగల సిటిజెన్ గా ఉండండి : మహేష్ బాబు
