ఆ డైరెక్టర్ మెగా ఫోన్ పక్కన పెట్టేశాడా..? హీరోగా హిట్స్ చూడటంతో దర్శకత్వంపై ఇంట్రస్ట్ చూపట్లేదా..? ఏడాదిలో ఐదారు సినిమాలు ఎలా సాధ్యం అవుతుందబ్బా..? స్టార్ హీరోలకు దక్కని హిట్ సీక్రెట్ ఏమై ఉంటుందంటారు..? నెక్ట్స్ ప్రాజెక్ట్ సంగతేంటో..? అనే చర్చలు సాగుతున్నాయి. ఓటీటీ ప్రపంచం వచ్చాక.. మాలీవుడ్ హీరోలంతా.. మన హీరోలుగా మారిపోయారు. వారిలో ఒకరు బాసిల్ జోసెఫ్. హి ఈజ్ నాట్ ఎ యాక్టర్.. మల్టీ టాలెంటర్. డైరెక్టర్, సింగర్, రైటర్ ఇలా 24 ఫ్రేమ్స్ పై పట్టుసాధించాడు. కానీ డైరెక్టర్ కన్నా యాక్టర్‌గా క్లిక్ అయ్యాడు. జయ జయ జయ జయ హే, గురువాయిర్ అంబలనడియుల్, ఏఆర్‌ఎం వంటి సినిమాలతో బాయ్ నెక్ట్స్ డోర్‌గా కనిపించే బాసిల్ జోసెఫ్ రీసెంట్లీ సూక్ష్మదర్శినీతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత నజ్రియా మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
Pushpa 2: ఇంకెక్కడి బాహుబలి, RRR.. రికార్డులన్నీ రప రపే!
ఈ ఏడాది బాసిల్ నటించిన సినిమాలన్నీ హిట్స్‌గా నిలవడం విశేషం. సెలక్టివ్, గ్రిప్పింగ్ కథలను ఎంచుకుని సక్సెస్ కొట్టేస్తున్నాడు బాసిల్. ప్రజెంట్ పోన్ మాన్ కంప్లీట్ కాగా, నెక్ట్స్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. ఫిబ్రవరి 6న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇలా సినిమాలతో బిజీగా ఛేంజ్ అవ్వడంతో డైరెక్షన్ డిపార్ట్ మెంట్‌పై ఫోకస్ చేయలేకపోతున్నాడు. కంప్లీట్ యాక్టింగే వైపే కాన్సట్రేషన్ చేస్తున్నాడు. 2021లో తెరకెక్కించిన మిన్నల్ మురళీ తర్వాత డైరెక్షన్ వైపు కన్నెత్తి చూడలేదు. మిగిలిన యంగ్ హీరోలతో పోల్చుకుంటే.. సూపర్ ఫాస్ట్ వేగంతో సినిమాలు కంప్లీట్ చేయడంతో పాటు రిలీజ్ చేస్తూ.. స్టార్ హీరోగా ఛేంజ్ అయ్యాడు. దీంతో మెగా ఫోన్ పట్టే తీరిక లేకుండా పోయింది పాపం.. .