Barbarik : అంచనాలు పెంచేసిన ‘త్రిబాణధారి బార్బరిక్’ స్ట్రైకింగ్ మోషన్ పోస్టర్
- మారుతీ సమర్పణలో మైథలాజికల్ కాన్సెప్ట్ సినిమా
- ‘త్రిబాణధారి బార్బరిక్’ స్ట్రైకింగ్ మోషన్ పోస్టర్ రిలీజ్
- పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ‘త్రిబాణధారి బార్బరిక్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ మేకర్లు ఎక్కువగా మైథలాజికల్ కాన్సెప్ట్‌తో చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. రామాయణ, మహాభారతాల్లోంచి పాత్రలను తీసుకుని సినిమాలను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్భరిక్ (బార్బరికుడు) మీద చిత్రం రాబోతోంది. త్రిబాణధారి బార్బరిక అంటూ అదిరిపోయే టైటిల్‌తో చిత్రం రాబోతోంది. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి ఆదిధాల నిర్మించిన ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ఎవరు తాతా ఇతను?.. ప్రపంచం గుర్తించని ఒక గొప్ప యోధుడమ్మా.. భీష్ముడా? తాతా.. హహ కాదమ్మా.. అంటూ సాగిన డైలాగ్స్.. ఇచ్చిన ఎలివేషన్స్.. ఆర్ఆర్, విజువల్స్ ఇలా అన్నీ కలిపి మోషన్ పోస్టర్ అంచనాలు పెంచేసింది. చూస్తుంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు సరిపోయే పాన్ ఇండియన్ కథలా కనిపిస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని ఆ స్థాయిలోనే అన్ని భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఏకకాలంలో మూడు బాణాలు వేయడంలో బార్బరికుడు నేర్పరి. అందుకే త్రిబాణధారి అని టైటిల్‌లోనే పెట్టేశారు. ఇక మోడ్రన్ కాలం నాటి తుపాకులు, బుల్లెట్లు కూడా ఈ మోషన్ పోస్టర్‌లో చూపించారు. గాండివదారి అర్జున, పాశుపశాస్త్రం, బ్రహ్మాస్త్రం, గరుడ పురాణం వంటి పుస్తకాలను కూడా ఈ వీడియోలో చూపించారు. మరి ఆ కాలానికి, ఈ కాలానికి కథను ఎలా లింక్ చేశారో చూడాలి. ఈ మోషన్ పోస్టర్ అనేది దర్శకుడి గొప్ప విజన్ కి, క్వాలిటీ మేకింగ్ పట్ల నిర్మాతల అంకితభావానికి నిదర్శనంగా ఉంది. భారతీయ సినిమా చరిత్రలో తొలిసారిగా ఇన్ఫ్యూషన్ బ్యాండ్ అనే బ్యాండ్ సంగీతాన్ని అందించింది. వీడియోకు సంబంధించిన థీమ్ మ్యూజిక్ గూస్‌బంప్స్ ఇస్తోంది.
Also Read : Sai Pallavi : తెలుగు ప్రేక్షకులు చాలా మంచోళ్ళు. ఏ భాష నుంచి వచ్చినా ఆదరిస్తారు
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..