నటుడిగా కొన్ని సినిమాలు చేసినా నిర్మాతగానే ఫేమస్ అయిన బండ్ల గణేష్ త్వరలో భారీ ఎత్తున సినిమాలను లైన్ లో పెట్టనున్నారు. ఇప్పటికే ఆయన పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికి రాజకీయాలలో యాక్టివ్ గా ఉంటున్న ఆయన కాంగ్రెస్ లో తనదైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోపక్క సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్న బండ్ల గణేష్ సినీ రాజకీయ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. అయితే తాజాగా బండ్ల గణేష్ ఆధ్యాత్మిక పాదయాత్రకు శ్రీకారం చుట్టుబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన తన స్వగ్రామమైన షాద్నగర్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.
Akhanda 2: హిమాలయాల బాటపట్టిన బోయపాటి
బండ్ల గణేష్ వెంకటేశ్వర స్వామి భక్తుడనే విషయం సినీ పరిశ్రమలో ఉన్న అందరికీ సుపరిచితమే. అయితే మొట్టమొదటిసారిగా ఆయన తన స్వగ్రామం నుంచి తిరుమల దేవస్థానానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లబోతూ ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్న బండ్ల గణేష్ తిరుమల శ్రీవారిని దర్శించేందుకు పాదయాత్రగా బయలుదేరి వెళుతూ ఉండడం ఆసక్తి రేపుతోంది. అయితే ఆయన ఈ పాదయాత్ర ఎందుకు మొదలు పెట్టబోతున్నారు ? ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు అనే విషయం ప్రారంభమయ్యే రోజు క్లారిటీ ఇవ్వనున్నారు.