Bandla Ganesh Shares Risky Accident to Pawan Kalyan at Gabbar Singh Shoot: హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా గబ్బర్ సింగ్. ఈ సినిమా 2012 వ సంవత్సరం మే 11వ తేదీన రిలీజ్ అయింది. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. ఆసక్తికరంగా రీ రిలీజ్ కి కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన బండ్ల గణేష్ అక్కడ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ అయితే గుర్రం స్వారీ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో వెనక్కి పడిపోయాడని ఆ సమయంలో ప్రాణాలు కూడా పోయేవని ఆయన వెల్లడించాడు. నిజానికి గుజరాత్ లో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ ఘటన జరిగిందని బండ్ల పేర్కొన్నాడు.
Bandla Ganesh: బండ్ల గణేష్ బుల్లెట్ ఆన్సర్స్.. బన్నీని అంతమాట అనేశాడేంటి..?
ఇక ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు తనను సెట్ లోకి రానిచ్చేవారు కాదని పవన్ కళ్యాణ్ డైరెక్టర్ ఏం చెబితే అది చేయాలని మొదటి రోజే చెప్పాడని అందుకు కట్టుబడి హరీష్ శంకర్ ఏం చెప్పినా తాను చేస్తూ వచ్చానని అన్నారు. తనను హరీష్ శంకర్ కూడా సెట్ లోకి రానిచ్చేవాడు కాదని మరుసటి రోజు చేయాల్సిన పనులను ముందే పురమాయిస్తూ ఆయన బిజీబిజీగా ఉంచేవాడని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండవ తేదీన రీ రిలీజ్ చేస్తున్నారు. జనసేన నేత తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అనుశ్రీ సత్యనారాయణ ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ రెండవ తేదీన ఇప్పటికే హౌస్ ఫుల్ అయిపోవడంతో ముందు రోజు రీ రిలీజ్ సినిమాకు కూడా ప్రీమియర్స్ ప్లాన్ చేసినట్లు ఆయన వెల్లడించారు.