టాలీవుడ్‌లో దీపావళి అనగానే గుర్తొచ్చే అతికొద్ది మంది పేర్లలో బండ్ల గణేష్ పేరు కూడా ఒకటి. ప్రతిదీ దీపావళికి ఒక లారీ లోడు టపాసులతో కలిసి కూర్చొని ఫోటోలు దిగి, ఆయన దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటారు. అయితే ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా, టాలీవుడ్ సెలబ్రిటీలందరికీ ఆయన ఒక పార్టీ ఇస్తున్నారు.
Also Read:RC 17: పుష్ప 3 కన్నా ముందే చరణ్ సుక్కు సినిమా
హైదరాబాదులోని జూబ్లీహిల్స్, బండ్ల గణేష్ నివాసంలో ఈరోజు రాత్రి ఈ వేడుక జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్న ఈ కార్యక్రమానికి, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో పాటు పలువురు యంగ్ హీరోలు కూడా హాజరు కాబోతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్‌ని కూడా ఆహ్వానించారని, వీలైతే ఆయన కూడా వస్తారనే ప్రచారం ఉంది. కేవలం సినీ ప్రముఖుల వరకే పరిమితం కాకుండా, బండ్ల గణేష్ రాజకీయ ప్రముఖులను సైతం ఆహ్వానించాలని తెలుస్తోంది. మరి ఈరోజు రాత్రి జరగబోతున్న పార్టీకి ఎవరెవరు హాజరు కాబోతున్నారని, మరికొద్ది సేపట్లో తేలిపోనుంది.
