బండ్ల గణేష్ నిర్మాతగా, నటుడుగా అందిరికి సుపరిచితుడే. నిర్మాతగా స్టార్ హీరోలతో సినిమాలు చేసిన బండ్ల గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ సంగతి అలా ఉంచితే బండ్ల గణేష్ స్పీచ్ లకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటరేనిది ఒప్పుకోలేని వాస్తవం. అది సినిమా వేడుకైనా, పొలిటకల్ ఈవెంట్ అయిన తనదైన మార్క్ స్పీచ్ తో అదరగొడతాడు బండ్ల. తాజాగా జరిగిన లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లోను బండ్ల గణేష్ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా హాట్ టాపిక్ గా మారింది.
Also Read : Bandla Ganesh : ఈ ఫిల్మ్ నగర్ మాఫియాకు దూరంగా ఉండు మౌళి
ఈ వేడుకలో బండ్ల గణేష్ మాట్లాడుతూ మరొక నిర్మాత అల్లు అరవింద్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. బండ్ల మాట్లాడూతూ ‘ రూ. 500, 1000 కోట్ల సినిమాలు కాదు, లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు ఎక్కువగా రావాలి. ఈ సినిమాను కేవలం రూ. 2.5 కోట్లతో తీసారని చేప్పారు. బన్నీవాసు, నందిపాటి వంశీ మీ ఇద్దరు కష్టపడితే లాస్ట్ లో అల్లు అరవింద్ వచ్చి క్రెడిట్ మొత్తం కొట్టేస్తారు. మీరు చాలా కస్టపడి తీసి అల్లు అరవింద్ సినిమా ఇది అని అంటున్నారు. అది ఆయన అదృష్టం.. మీ దురదృష్టం. నిజంగా అరవింద్ ఏమి చేయరు. లాస్ట్ మినిట్ లో వస్తారు.. ఆహా అంటాడు క్రెడిట్ మొత్తం కొట్టేస్తాడు. అది అయన జాతకం. అరవింద్ సార్ మీ షర్ట్ నలగదు.. మీ హెయిర్ స్టైల్ మారదు కానీ డబ్బులు మాత్రం సంపాదిస్తారు. టీమ్ అంత కస్టపడి పని చేసాక లాస్ట్ లో వచ్చి క్రెడిట్ కొట్టే అల్లు అరవింద్ కు కృతజ్ఞతలు’ అని అన్నాడు. ఈ కాంట్రవర్సీ వ్యాక్యలపై బండ్ల ఉద్దేశం ఏంటో.
