‘బాలికా వధూ 2’ ప్రోమో విడుదలైంది. సరికొత్త ఆనంది ఎవరో ప్రేక్షకులకి తెలిసిపోయింది. గతంలో డైలీ సీరియల్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్న ‘బాలికా వధూ’కి ఇది సీక్వెల్ అనుకోవచ్చు. అయితే, కంప్లీట్ గా కొత్త స్టోరీ అని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఇంతకు ముందు బాలికా వధూగా అవికా గోర్ నటించింది. ఈసారి ఆనంది పాత్రలో కనిపించిన చిన్నారి మరింత తక్కువ వయస్సు అమ్మాయి కావటం విశేషం. ప్రోమోలో ఆమెని కొత్త పెళ్లికూతురుగా చూపించారు. ఇంట్లో కాలుమోపిన బాలికా వధూ తరువాతి సన్నివేశంలో ఎడారిలో నడుస్తూ కనిపిస్తుంది…
Read Also : చరణ్, దిల్ రాజు, శంకర్ మీటింగ్… త్వరలోనే అప్డేట్
‘బాలికా వధూ’ లాంటి డైలీ సోప్స్ చూసేవారికి ‘బాలికా వధూ 2’ కూడా ఆసక్తి కలిగించే అవకాశం ఉంది. ప్రోమో ఇంట్రస్టింగ్ గా కట్ చేశారు మేకర్స్. బాల్య వివాహాలు ఇంకా మన సమాజంలో ఉన్నాయి. వాట్ని అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
‘బాలికా వధూ’ సీజన్ వన్ అప్పట్లో తెలుగులోనూ అలరించింది. ‘చిన్నారి పెళ్లికూతురు’గా ఇక్కడ ప్రసారం అయింది. ‘బాలికా వధూ 2’ కూడా వివిధ భాషల్లోకి అనువాదం అయ్యే అవకాశాలున్నాయి. అయితే, ముందుగా హిందీ వర్షన్ కి జాతీయ స్థాయిలో ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి…
