NTV Telugu Site icon

Balayya Boyapati 4: బాలయ్య ఫాన్స్ ఊపిరి పీల్చుకోండి !

Akhanda 2

Akhanda 2

Balayya Boyapati 4 May Be Akhanda 2:నందమూరి బాలకృష్ణ కెరియర్ లో అఖండ సినిమా ఒక అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అప్పటివరకు ఆయన కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది అంతేకాక. కరోనా సమయంలో ప్రేక్షకులను ట్రాక్టర్ల మీద కూడా ధియేటర్లకు తీసుకొచ్చిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. ఇప్పుడు ఆ సీక్వెల్ కి సంబంధించిన ప్రకటన రేపు వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. అసలు విషయం ఏమిటంటే బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో నాలుగో సినిమాకి సంబంధించిన ముహూర్తం రేపు ఉదయం 10 గంటలకు ఉంది. విజయదశమి సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది సినిమా యూనిట్.

Sreenath Bhasi: మంజుమ్మల్ బాయ్స్ నటుడు అరెస్ట్.. అసలు ఏమైందంటే?

14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా అఖండ 2 అనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పటి వరకు సినిమా యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు కానీ దాదాపుగా ఇది అఖండ 2 అనే ప్రచారం అయితే జరుగుతుంది. రేపు చిన్నపాటి టీజర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందనే ప్రచారం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది. ఏ విషయం రేపు ఉదయానికి క్లారిటీ వచ్చేది అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం మీద బాలయ్య ఫ్యాన్స్ అది అఖండ 2 అయినా సరే కాకపోయినా సరే ఆ కాంబినేషన్ కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు.

Show comments