Sreenath Bhasi: మంజుమ్మల్ బాయ్స్ నటుడు అరెస్ట్.. అసలు ఏమైందంటే?
- మంజుమ్మల్ బాయ్స్ నటుడు అరెస్ట్
- హిట్ అండ్ రన్ కేసులో శ్రీనాథ్ భాసి అరెస్ట్
- స్టేషన్ బెయిల్ పై విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sreenath Bhasi Arrest: హిట్ అండ్ రన్ కేసులో మలయాళ మంజుమ్మల్ బాయ్స్ సినిమా నటుడు శ్రీనాథ్ భాసిని అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేసినట్లు సమాచారం. మట్టంచేరి ప్రాంతానికి చెందిన ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఘటన గత నెలలో కొచ్చిలో చోటుచేసుకుంది. సెప్టెంబర్ 8న రాంగ్ డైరెక్షన్‌లో వస్తున్న భాసీ కారు ఫిర్యాదుదారు స్కూటర్‌ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిందని ఆరోపించారు. ఈ ప్రమాదంలో ఫిర్యాదుదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ ఘటనలో నటుడిపై ఎలాంటి తీవ్రమైన అభియోగాలు నమోదు కాలేదని, సాధారణ ప్రక్రియలో భాగంగా నటుడిని పిలిపించి అరెస్టు చేసి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.
Ananya Panday : బ్లాక్ డ్రెస్సులో కనిపించి కనిపించని అందాలతో అదరహో అనిపిస్తున్న అనన్య
Also Read
గతంలో డ్రగ్స్ కేసులో ఓం ప్రకాష్ అరెస్ట్ అయినప్పుడు కూడా శ్రీనాథ్ భాసీపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అరెస్టయిన బిను జోసెఫ్‌తో శ్రీనాథ్ భాసీకి ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. అయితే శ్రీనాథ్ భాసి, ప్రయాగ మార్టిన్‌లపై ఎలాంటి ఆధారాలు లభించలేదని కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ పుట్టా విమలాదిత్య తెలిపారు. ఎలమక్కకు చెందిన బిను జోసెఫ్ అనే వ్యక్తి శ్రీనాథ్ భాసి, ప్రయాగ మార్టిన్‌లను కొచ్చిలోని హోటల్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకుని లోతుగా విచారించారు. ఆ తర్వాత శ్రీనాథ్ భాసి, ప్రయాగ మార్టిన్‌లను మారాడు పోలీసులు విచారించారు. శ్రీనాథ్ వాంగ్మూలాల్లో పొంతన ఉన్నట్లు పోలీసులు తేల్చారు. బిను జోసెఫ్‌తో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు శ్రీనాథ్ కూడా అంగీకరించాడు.
తాజావార్తలు
-
Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?