Site icon NTV Telugu

Balayya : అభిమాని గృహప్రవేశానికి బాలయ్య.. వీడియో వైరల్

Untitled Design (2)

Untitled Design (2)

నందమూరి బాలకృష్ణ అభిమానులు ముద్దుగా బాలయ్య, బాల అని పిలుస్తుంటారు. ఎన్నో వైవిధ్య భరితమైన సినిమాల్లో నటించి మెప్పించి టాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం బాలయ్య గోల్డెన్ ఎరా నడుస్తుందని చెప్పాలి. ఒకవైపు వరుస సూపర్ హిట్ సినిమాలు, మరో వైపు అన్ స్టాపబుల్ టాక్ షోను తన భుజస్కందాలపై నడిపిస్తూ మిగతా హీరోలతో కూడా జై బాలయ్య అనేలా ఆయన జర్నీ కొనసాగుతుంది. మరోవైపు హిందూపురం శాసన సభ్యుడిగా ప్రజలకు విశేష సేవలందిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు బాలయ్య.

ఇదిలా ఉండగా తాజాగా బాలయ్యకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో చుసిన ప్రతి ఒక్కరు బాలయ్య మనసు బంగారం, తండ్రికి తగ్గ తనయుడు, మా మంచి ముద్దులమావయ్య మా బాలయ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకి ఆ వీడీయోలో ఏముందంటే ఇటీవల నందమూరి బాలకృష్ణ అయన ఒక అభిమాని ఇంటి గృహప్రవేశానికి వెళ్లారు. ఎక్కడో చిన్న పరిచయం ద్వారా బాలయ్యను వారి ఇంటి గృహప్రవేశానికి ఆహ్వానించగా అభిమాని కోరిక మేరకు ఆ కార్యక్రమానికి హాజరయి, దంపతులను ఆశీర్వదించి, అభిమాని కుటుంబ సభ్యులతో దాదాపు 3 గంటల సమయం అక్కడే ఉండి వారితో పాటు భోజనం చేసి, ఫోటోలు దిగారు. ఆయన బిజీ షెడ్యూల్ లో కూడా తమకోసం వచ్చిన బాలయ్య గొప్ప హృదయానికి ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఇంత డౌన్ టూ ఎర్త్ పర్సన్ ను మా జీవితంలో చూడలేదు, బాలయ్య మంచి మనసుకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ వీడియో రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది

Also Read : Pawan Kalyan : మెగాస్టార్ గిన్నిస్ రికార్డ్ పై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..?

Exit mobile version