Site icon NTV Telugu

‘బలమెవ్వడు’ కోసం మణిశర్మ స్వరాలకు కీరవాణి గాత్రం!

Balamevvadu Title Song

టాలీవుడ్ లో ఎం. ఎం. కీరవాణి, మణిశర్మ ఇద్దరూ దిగ్గజ సంగీత దర్శకులు. వీళ్లు కలిసి ఓ పాటకు పనిచేస్తే ఆ పాట ఎంతో ప్రత్యేకమైనదై ఉండాలి. మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఎన్టీఆర్ సినిమా ‘సుబ్బు’లో కీరవాణి పాట పాడారు. ఆ పాట తర్వాత 20 ఏళ్లకు ‘బలమెవ్వడు’ చిత్రంలో మణిశర్మ స్వరకల్పనలో కీరవాణి పాట పాడటం విశేషం. ‘బలమెవ్వడు కరి బ్రోవను…’ అని సాగే పాటను కీరవాణి అద్భుతంగా ఆలపించారు. ‘బలమెవ్వడు’ సినిమా క్లైమాక్స్ ఫైట్ లో బ్యాక్ గ్రౌండ్ సాంగ్ లా ఇది వస్తుంది. ‘అల వైకుంఠపురములో’ ఫేమ్ లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి ఈ పాటను రాశారు. ‘బలమెవ్వడు కరి బ్రోవను..’ పాటకు కీరవాణి మాత్రమే న్యాయం చేయగలరని మణిశర్మ భావించి ఈ పాటను ఆయనతో పాడించారు.

Read Also : “ఎస్ఆర్ కళ్యాణమండపం” సెన్సార్ పూర్తి

ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న ‘బలమెవ్వడు’ సినిమా వైద్యరంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్. బి. మార్కండేయులు ‘బలమెవ్వడు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ కాన్సెప్ట్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సుహాసిని వైద్య రంగానికి చెందిన మాఫియాను ప్రశ్నించే డాక్టర్ పాత్ర పోషించడం విశేషం.

Exit mobile version