Site icon NTV Telugu

Unstoppable with NBK season 4: బాలయ్యతో కిస్సిక్ అనిపించిన శ్రీ లీల

Uns

Uns

గత కొద్దిరోజులుగా కిసిక్ సాంగ్ ఎంత వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి గాను శ్రీ లీల ఈ స్పెషల్ సాంగ్ చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సినిమా రిలీజ్ కి ముందు ఆహాలో నందమూరి బాలకృష్ణ హౌస్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ ఫోర్ లో ఆమె కనిపించనుంది నవీన్ పోలిశెట్టి శ్రీ లీల కలిసి హాజరైన తాజా ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రోమో ఆద్యంతం నవ్విస్తూ సాగింది. నవీన్ స్టైల్ పంచులు, శ్రీ లీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఈ ప్రోమో ఆసక్తికరంగా సాగిందని చెప్పవచ్చు.

Pushpa2: రిలీజ్ కి ముందు మొట్ట మొదటి సినిమాగా సంచలన రికార్డు..

ఇక ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిన కిసిక్ స్టెప్ ని శ్రీ లీల నందమూరి బాలకృష్ణ తో పాటు నవీన్ పోలిశెట్టితో కూడా వేయించింది. వారిద్దరికీ ఆమె ఈ హుక్స్ స్టెప్ ఎలా వేయాలో చేసి చూపించడం గమనార్హం. ఇక బాలయ్య డాక్టర్ శ్రీలీల అని అంటుంటే దానికి నవీన్ పోలిశెట్టి కూడా శ్రీ లీల ఫస్ట్ యియర్ కూర్చి మడతపెట్టి, సెకండ్ యియర్ జింతాక్, థర్డ్ ఇయర్ కిస్సిక్ అని అంటూ కామెంట్ చేశారు. ఇక NBK సీజన్ 4 అన్‌స్టాపబుల్ లోని ఈ ఆరవ ఎపిసోడ్‌ ఆహాలో డిసెంబర్ 6, 2024న ప్రసారం అవుతుంది.

Exit mobile version