నందమూరి సీనియర్ హీరో బాలయ్యకు గత రెండేళ్లు బాగా కలిసివచ్చింది.. కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తూ బ్యాక్ టూ బ్యాక్ వరుసగా మూడు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. అంతే కాదు 100 కోట్ల మార్క్ ను కూడా బాలయ్య అందుకున్నారు.. ఇక సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి వ్యవహారిస్తున్నారు.. ఇప్పటికే వరుస సినిమాలులైన్ లో పెట్టాడు బాలయ్య. అందులో ప్రస్తుతం ఆయన 109వ సినిమా చేస్తున్నాడు. మెగా హీరోలతో వరుస సినిమాలు చేస్తూ వస్తున్న బాబీతో బాలయ్య మాస్ సినిమాచేస్తున్నాడు..
ఈ సినిమా గురించి ఏదోక అప్డేట్ వస్తూనే ఉంది..బాలయ్య, బాబీ కాంబోలో వస్తున్న సినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయ్యింది..ఇక ఈమూవీకి సబంధించి ఏదొ ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది. బాబీ తీసే ప్రతీ సినిమాలలో ఒక ప్రత్యేక ఐటమ్ సాంగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలలో అన్ని పాటలు మంచి హిట్ టాక్ ను సోషల్ చేసుకున్నాయి..
ఎన్బీకే 109 సినిమాలో కూడా బాబీ ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను సంప్రదించినట్లు టాక్.. ఇక దీనిపై తమన్నా కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యిందని టాక్..రెమ్యూనరేషన్ భారీగానే డిమాండ్ చేస్తుందని కూడా టాక్.. అయితే తమన్నా ఈ పాట కోసం రెండు కోట్లు డిమాండ్ చేసిందని వార్తలు వస్తున్నాయి.. మరోవైపు శృతిహాసన్ ను కూడా అడుగుతున్నట్లు తెలుస్తుంది.. తమన్నా చేసిన సాంగ్స్ అన్ని హిట్ అవ్వడంతో ఇప్పుడు ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. సితార బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, ఎస్.సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే ఈ మూవీలో మలయాళ స్టార్ దుల్కర్ కూడా నటిస్తున్నట్టు సమాచారం. అయితే నట సింహం బాలకృష్ణతో దుల్కర్ సల్మాన్ కలిసి వెండితెరపై కనిపిస్తే ఎలా ఉంటుందో అని బాలయ్య ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..
