నందమూరి నటసింహం బాలకృష్ణ కూతురు తేజస్విని తాజాగా ఒక కమర్షియల్ యాడ్‌లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు ఎప్పుడూ కెమెరా ముందుకు రాని ఆమె, ఈసారి బిజినెస్‌కు సంబంధించిన ఒక బ్రాండ్ ప్రమోషన్ వీడియోలో కనిపించింది. యాడ్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో అది వైరల్ అవుతోంది. కాగా ఈ వీడియోలో తేజస్విని తనదైన గ్రేస్‌తో, కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ తో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. చాలామంది నెటిజన్లు “తండ్రి లాగే స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది”, “ఇక నందమూరి కుటుంబం నుంచి కొత్త ఫేస్ ఎంట్రీ కాబోతుందేమో” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read : Baahubali: The Epic : బాహుబలి ది ఎపిక్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం..
ఇక ఇండస్ట్రీ టాక్ ప్రకారం, తేజస్విని సినిమాల్లో నటించే ఆలోచనలో లేరట. కేవలం ఆ యాడ్ ప్రాజెక్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ రిక్వెస్ట్ మేరకు చేసినట్లు చెబుతున్నారు. అయితే, ఆమె స్క్రీన్ మీద చూపించిన నేచురల్ యాక్టింగ్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ చూసి సినీ వర్గాల్లో “తేజస్విని ఎప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తే ఆశ్చర్యం లేదు” అనే చర్చ మొదలైంది. మొత్తానికి, బాలకృష్ణ కూతురు తేజస్విని కమర్షియల్ యాడ్‌తో ఒక చిన్న స్క్రీన్ డెబ్యూ ఇచ్చినా, ఆ ఒక్క యాడ్‌తోనే మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది.
