Site icon NTV Telugu

Akhanda 2 : ఈ తరం పిల్లలతో సహా.. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ‘అఖండ 2’ : బాలకృష్ణ

Akanda Song Event

Akanda Song Event

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా సినిమా ‘అఖండ 2’ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ ఆచంట – గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మేనన్ హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘తాండవం’ పాటను ముంబయిలో విడుదల చేశారు. కార్యక్రమంలో తమన్, ఆది, కైలాష్ ఖేర్ మొదలైన వారు పాల్గొన్నగా. పాటలో బాలకృష్ణ అఘోర లుక్‌లో చేసిన శివతాండవం, తమన్ ఇచ్చిన మ్యూజిక్‌తో కలిసి అద్భుతమైన డివైన్ ఫీల్‌ తీసుకువచ్చింది.

Also Read : Janhvi Kapoor : మీ కెరీర్‌కు టాలీవుడ్ ఏ కరెక్ట్.. జాన్వీ‌పై తెలుగు డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

“రంగరంగ శంభులింగ ఈశ్వర భుజంగా శంకర” అంటూ సాగిన ఈ పవర్‌ఫుల్ పాటను శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ ఆలపించారు. అయితే ఈ ఈవెంట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ.. “సనాతన ధర్మం శక్తి, పరాక్రమం మొత్తం ‘అఖండ 2: తాండవం’ లో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను తీసుకెళ్లి ఈ సినిమా తప్పకుండా చూపించాలి” అన్నారు. ప్రజంట్ బాలయ్య మాటలు వైరల్ అవుతుండగా.. దర్శకుడు బోయపాటి నిర్మాణం, బాలకృష్ణ నటన కలిసి ఇచ్చే ఎనర్జీ గురించి చెప్పుకుంటూ, “ఇది మా నాలుగో సినిమా. కేవలం సినిమా కాదు, భారతదేశ ఆత్మ లాంటిది. కఠినమైన వాతావరణంలో షూట్ చేశాం, అందరూ స్వెటర్లు వేసుకున్న బాలయ్య మాత్రం పంచె కట్టుకుని పాట పాడారు. అది ఆయన డెడికేషన్’’ అన్నారు.

Exit mobile version