Bagheera : ప్రశాంత్ నీల్ నన్ను చాలా బలంగా నమ్మారు : శ్రీమురళి
- శ్రీమురళి హీరోగా వస్తున్న బఘీర
- భారీ బడ్జెట్ పై నిర్మించిన హోంబాలే సంస్థ
- తెలుగు మీడియాతో ముచ్చటించిన శ్రీ మురళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బఘీర’తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో బఘీర విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీమురళి విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
Q : ‘బఘీర’ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది ?
Ans – ప్రశాంత్ నీల్ గారు ఫస్ట్ స్టోరీ ఇచ్చారు. నన్ను ఈ స్టొరీ చేయమని చెప్పారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నా కెరీర్ లో ఉగ్రం లాంటి ఒక గొప్ప సినిమా ఇచ్చారు. ఉగ్రం సినిమా సమయంలో మేము చాలా క్లోజ్ అయ్యాం. హోంబలే ఫిలింస్ ప్రొడ్యూస్ చేస్తామని ముందుకు వచ్చారు. అలా ఈ ప్రాజెక్టు మొదలైంది.
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
Q : తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు ?
– మా అత్తగారిది నెల్లూరు. ఇంట్లో వైఫ్, అత్తగారు తెలుగు మాట్లాడుతారు. అలా వచ్చింది (నవ్వుతూ)
Q : ఈ క్యారెక్టర్ కోసం మూడేళ్లు జిమ్ ట్రైనింగ్ తీసుకున్నారని విన్నాం ?
-అవునండి. క్యారెక్టర్ అలాంటిది. నేను నిజానికి ఫుడ్ లవర్ ని. చికెన్, మటన్, రైస్ అన్ని ఇష్టంగా తింటాను. బిర్యాని అంటే పిచ్చి. కానీ ఈ మూడేళ్లు చాలా కష్టంగా గడిచింది. చాలా స్ట్రిక్ డైట్ చేశాను. లిక్విడ్ డైట్ చేశాను. అది చాలా ఛాలెంజ్. నా కెరీర్లో ఇది వెరీ డేరింగ్, అండ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్. క్యారెక్టర్ డిమాండ్ ప్రకారం చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశాను. ఈ మూడేళ్లలో నాలో చాలా మార్పులు వచ్చాయి.
Q : డైరెక్టర్ డాక్టర్ సూరి గురించి ?
-ప్రశాంత్ నీల్ గారు స్టోరీ ఇచ్చారు. డైరెక్టర్ సూరి గారు 100% కథని అద్భుతంగా స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు. ఈ స్టోరీని, ఐడియాని అద్భుతంగా ఎరలైజ్ చేశారు. ఇది లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కంటెంట్. డైరెక్టర్ గారు నా నుండి చాలా మంచి పెర్ఫార్మన్స్ ని రాబట్టుకున్నారు. పర్సనల్ గా ఇది నాకు చాలా ఫేవరెట్ క్యారెక్టర్. సూరి గారి లాంటి బ్రిలియంట్ టెక్నీషియన్ తో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.
Q : ప్రశాంత్ నీల్ గారి సపోర్టు ఎలా ఉండేది?
-నాకు ప్రశాంత్ నీల్ గారి సపోర్టు ఎప్పుడు ఉంటుంది. టీంలో అందరం డిస్కస్ చేసుకునేవాళ్ళు. ప్రశాంత్ నీల్ గారికి గ్రేట్ విజన్ ఉంది. నన్ను ఆయన చూసే పర్స్పెక్టివ్ డిఫరెంట్. ఆయన నన్ను చాలా బలంగా నమ్మారు.
Q : మీ నుంచి తెలుగులో వస్తున్న మొదటి సినిమా ఇది, ఈ సినిమానే తీసుకురావడానికి కారణం?
-ఇది మా ప్రొడక్షన్ కాల్. చాలా మంచి సినిమా చేశా. దేశమంతా చూడదగ్గ సినిమా ఇది. ఆ నమ్మకంతో ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాం. తెలుగు ప్రేక్షకుల నుంచి లవ్, సపోర్ట్ లభిస్తుందని నమ్ముతున్నాను.
Q : ఉగ్రం 2 అనౌన్స్ చేశారు కదా.. అందులో మీ క్యారెక్టర్ గురించి ?
-అది నాకు తెలియదండి. మీరు ప్రశాంత్ నీల్ గారిని అడగాలి (నవ్వుతూ). ఆయనతో వర్క్ చేయడానికి నేను ఎదురుచూస్తున్నాను.
Q : ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్లు పూర్తయింది కదా.. ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది?
-ఫెంటాస్టిక్ జర్నీ. నా సినిమాలన్నీ ఇష్టపడి చేశాను. మిస్టేక్స్ నుంచి నేర్చుకున్నాను. ఇంకా బెటర్ మూవీస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ జర్నీలో ఎత్తు పల్లాలు ఉన్నాయి. ఉగ్రం తర్వాత రీబర్త్ వచ్చింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2014 నుంచి ఇప్పటివరకు నా సినిమాలన్నీ సక్సెస్ఫుల్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను.
Q : మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతారా?
A – కథ బావుండి, కథలో నా క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటే మల్టీ స్టారర్స్ లో పార్ట్ అవడం నాకు ఇష్టమే.
ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..