Site icon NTV Telugu

Bollywood : పుత్రోత్సాహంతో పులకించిపోయేందుకు స్వయంగా రంగంలోకి దిగిన బాద్ షా

Srk

Srk

బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు బాద్ షాగా పేరు తెచ్చుకుని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న షారూక్ నటనా వారసత్వాన్ని కూతురికి ఇచ్చి కొడుకుకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు. డ్రగ్ కేసులో ఇరుక్కుని క్లీన్ చీట్‌తో బయటపడ్డ ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీలోకి ఎంటరౌవుతూ హీరోగా కన్నా కెప్టెన్ ఆఫ్ ది షిఫ్ అయ్యేందుకే ప్లాన్ చేసుకున్నాడు. కొడుకు ఇష్టాఇష్టాలను కాదనలేని ఫాదర్ ఆర్యన్‌ను దర్శకుడిగా నిలబెట్టేందుకు బిగ్ స్కెచ్చే రెడీ చేశాడు. బ్యాడ్ ఆఫ్ బాలీవుడ్ కోసం స్టార్లను రంగంలోకి దింపాడు.

Also Read : Allu Aravind : పవన్ కళ్యాణ్ ను అల్లు అరవింద్ అమ్మ ఏమనిపిలుస్తారో తెలుసా?

ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతోన్న బ్యాడ్ ఆఫ్ బాలీవుడ్ సెప్టెంబర్ 18న నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. సెవెన్ ఎపిసోడ్లుగా తీసుకు వస్తున్న ఈ సిరీస్‌లో బాబీడియోల్, లక్ష్య, షాహీర్ మెయిన్ లీడ్స్. ఇది పేరుకు సిరీస్ అయినా ఓ భారీ సినిమానే ప్లాన్ చేశాడు షారూక్‌. ఓన్ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన్న ఈ వెబ్ సిరీస్ కోసం తనతో పాటు స్టార్ట్ కాస్ట్ పట్టుకొచ్చాడు. సల్మాన్, అమీర్ ఖాన్, షారూఖ్ మాత్రమే అర్జున్ కపూర్, రాజ్ కుమార్ రావ్‌తో పాటు కరణ్ జోహార్ మన రాజమౌళి కూడా అలా మెరిశారు. కానీ వీరందరిని కొడుకు వెబ్ సిరీస్ కోసం అందరి స్టార్స్ ను స్పెషల్ గా రిక్వెస్ట్ చేసి మరి తీసుకువచ్చాడట షారుక్. వెబ్ సిరీస్ కె ఈ రేంజ్ అంటే థియేటర్ సినిమాకు ఇంకెంత మందిని ప్లాన్ తీసుకువస్తాడో షారుక్ అని చర్చించుకుంటున్నారు. ఎనీవే పుత్రోత్సాహంతో పులకించిపోయేందుకు బాద్ షా స్వయంగా రంగంలోకి దిగినట్లే కనిపిస్తోంది. షారుక్ కు కొడుకంటే ఎంతో అమితమైన ప్రేమ. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సమయంలో షారుక్ కన్నీటితో నిద్రలేని రాత్రుళ్ళు గడిపాడని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటారు. ఇప్పుడు డైరెక్టర్ గా కొడుకుని నిలబెట్టేందుకు షారుక్ అన్ని తానై వ్యవహరిస్తున్నాడు.

Exit mobile version