NTV Telugu Site icon

BachhalaMalli : గమ్యం, నాందిలా బచ్చల మల్లి సూపర్ హిట్ అవుతుంది: అల్లరి నరేష్

Bacchalamalli (2)

Bacchalamalli (2)

హీరో అల్లరి నరేష్ తన అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’లో కంప్లీట్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. తాజగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ ‘తెలుగు సినిమా అభిమానులందరికీ నమస్కారం.  డైరెక్టర్ సుబ్బు మూడేళ్లు ఈ సినిమాతో జర్నీ చేశారు. ఈ సినిమా గురించి తప్ప దేని గురించి ఆలోచించలేదు. అది నాకు చాలా నచ్చింది. ఆయన కథ ఎంత అద్భుతంగా చెప్పారో అంతకంటే అద్భుతంగా సినిమా తీశారు. సినిమా చూశాను కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను.

Also Read : SubbaRaju : నటుడు సుబ్బరాజు భార్య స్రవంతి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇదే..

ఈ సినిమాలో సాంగ్స్ చాలా స్పెషల్ గా ఉండబోతున్నాయి.విశాల్ అండ్ డైరెక్టర్ సుబ్బు దాదాపు 6 నెలలు కూర్చుని ఈ సినిమా కోసం పాటల్ని సిద్ధం చేశారు. చాలా కష్టపడి ఇష్టపడి చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్ గురించి మాట్లాడతారు. ప్రసాద్ బెహరా చాలా మంచి యాక్టర్. చాలా సెటిల్ గా చేస్తాడు. తను పెద్ద స్టార్ కావాలని కోరుకుంటున్నాను.   అమృత  దగ్గర్నుంచి ఈ సినిమాలో నటించిన అందరికీ చాలా మంచి పేరు వస్తుంది. బచ్చల మల్లి.. నా గత చిత్రాలు గమ్యం, నాందిలా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే సినిమా అవుతుంది. నాంది చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో, ఈ సినిమా చేస్తున్నప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉన్నాను. బచ్చలమల్లి డిసెంబర్ 20 తేదీన మీ ముందుకు వస్తుంది. థియేటర్లో అందరూ తప్పకుండా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని  అన్నారు.

Show comments