Site icon NTV Telugu

Babil Khan : బాబిల్ ఖాన్ పోస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన టాలీవుడ్ డైరెక్టర్..

Sai Rajesh

Sai Rajesh

రీసెంట్ గా బాలీవుడ్ ఓ ఫేక్ ఇండస్ట్రీ పని చేయడానికి ఇది సరైన ప్లేస్ కాదు.. అంటూ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు, బాబిల్ ఖాన్ చేసిన  వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. ఈ వీడియో పెట్టిన కొద్ది నిమిషాల్లోనే బాబిల్ దీన్ని డిలీట్ చేశారు. అప్పటికే ఇది వైరల్‌గా మారడంతో చర్చ మొదలైంది. ఇక బాలీవుడ్ తీరును ఎండగడుతూ బాబిల్ చేసిన వీడియో వైరల్ గా మారడంతో అతని టీమ్ క్లారిటీ ఇచ్చింది ‘బాబిల్ ఆవేదనను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని పేర్కొంది. అయితే తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ డైరెక్టర్ సాయి రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Rajinikanth : రజనీకాంత్ రిటైర్మెంట్‌ పై.. తలైవా భార్య ఇండ్రస్టింగ్ కామెంట్స్

‘మీ కంటికి మేము ఏమైనా పిచ్చోళ్లా కనిపిస్తున్నామా. మీరు ఏం చెప్పినా ఏం మాట్లాడకుండా కూర్చుంటామని అనుకుంటున్నారా? వీడియో లో అతడు ప్రస్తావించిన వారు మాత్రమే మంచి వాళ్ళు అయితే.. ఇంతకాలం అతనికి సపోర్ట్ నిలిచిన మేమంతా పిచ్చివాళ్లమా? ఒక గంట ముందు వరకూ అతడికి సపోర్ట్‌గా నిలవాలని అనుకున్నా. కానీ, మీ తీరు చూశాక ఇక్కడితో ఆగిపోవడం మంచిదనిపిస్తోంది. ఈ సానుభూతి ఆటలు ఇకపై పనిచేయవు మీరు నిజాయతీతో క్షమాపణలు చెప్పి తీరాల్సిందే’ అని సాయి రాజేష్ పోస్ట్ లో రాసుకొచ్చారు. ఇంతలోనే దీనిపై బాబిల్ ఖాన్ స్పందిస్తూ.. ‘ మీరు నా హృదయాన్ని ముక్కలు చేశారు. మీకోసం నేను ఎంతో శ్రమించా మీ సినిమాలోని పాత్రకు న్యాయం చేయడానికి రెండేళ్లపాటు కష్టపడ్డా ఎన్నో అవకాశాలు వచ్చినా అన్నింటినీ వదులుకున్నా’ అని రాసుకొచ్చాడు. వీరిద్దరి పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి. కానీ వీరిద్దరూ మళ్ళి వారి పోస్టులు డిలీట్ చేశారు. అయినప్పటికీ వీరిద్దరి మాటలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version