సినిమా బండి : ‘బావిలోన కప్ప’ లిరికల్ వీడియో సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రవీణ్ కంద్రెగుల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సినిమా బండి’. మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ పై ప్రశంసలు వర్షం కురిసింది. ఈ చిత్రం ఆటో రిక్షా డ్రైవర్ చుట్టూ తిరుగుతుంది. ఆటో డ్రైవర్ కు తన ఆటో వెనుక సీట్లో కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాతో తన స్నేహితుడితో కలిసి, అతను తన గ్రామ పరిస్థితిని మెరుగుపరిచేందుకు మంచి సినిమా చేయడానికి ప్రయత్నిస్తాడు. ట్రైలర్ లోని సన్నివేశాలు, డైలాగులు ప్రేక్షకులను చక్కిలిగింతలు పెట్టేశాయి. డి 2 ఆర్ ఇండీ బ్యానర్‌లో రాజ్, డికె ద్వయం ఈ చిత్రాన్ని నిర్మించారు. వికాస్ వశిష్ట, సందీప్ వారణాసి, రాగ్ మయూర్, త్రిషర, ముని వెంకటప్ప, ఉమా జి, సిరివెన్నెల యనమంధల, సింధు శ్రీనివాసమూర్తి, పూజారి రామ్ చరణ్, దవని ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సిరిష్ సత్యవోలు సంగీతం సమకూర్చారు. తాజాగా ‘సినిమా బండి’ నుంచి ‘బావిలోన కప్ప’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్. సినిమాకు సంగీతం అందించిన సత్యవోలు స్వయంగా ఈ సాంగ్ లిరిక్స్ రాసి, థానే పాడడం విశేషం. అందరినీ ఆకట్టుకుంటున్న ‘బావిలోన కప్ప’ లిరికల్ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.
Also Read
- Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
- C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
- Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
- Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
తాజావార్తలు
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
-
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!