Site icon NTV Telugu

Baahubali The Epic : కొత్త సన్నివేశాలతో బాహుబలి రీరిలీజ్‌లో సర్ప్రైజ్ ఎలిమెంట్స్

Baahubali The Epic

Baahubali The Epic

భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న చిత్రం ‘బాహుబలి’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మాస్టర్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో వచ్చిన ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకులను సంచలనంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ లెజెండరీ ఫ్రాంచైజ్ మళ్లీ థియేటర్లలోకి ‘బాహుబలి ది ఎపిక్’ అనే పేరుతో రాబోతున్నది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్, రాజమౌళి ఫ్యాన్స్ అందరూ థియేటర్‌లో ఆ వైడ్ మళ్లీ ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు. కొత్తగా చూసేవారికి ఇది ఓ విజువల్ ట్రీట్. చూసినవాళ్లకు.. పాత జ్ఞాపకాల్లో తేలిపోవడం ఖాయం.

అయితే తాజాగా ఇప్పటికే విడుదలైన రెండు పార్ట్స్‌ను కలిపి ప్రత్యేకంగా రూపొందించిన ఈ రీరిలీజ్‌కు సంబంధించి, థియేటర్లలో కొత్త సీన్స్ జోడిస్తున్నారన్న ప్రచారం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. గతంలో యూట్యూబ్‌లో విడుదల చేసిన డిలీటెడ్ సీన్స్‌కు వచ్చిన సూపర్ రెస్పాన్స్ చూసి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇతర రీరిలీజ్‌లలా కేవలం పాత ఫార్మాట్‌నే రిపీట్ చేయడం కాకుండా. ఈసారి ఫాన్స్‌కి ఒక కొత్త అనుభవం ఇవ్వాలని, కొన్ని అన్నివేళలూ చూపించని సీన్స్, డిలీట్ చేసిన దృశ్యాలు, కొత్త విజువల్స్ కూడా కలపబోతున్నారట. ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కి ఇది పండగే. పాత సినిమాల కాకుండా, ఇన్‌హాన్స్‌డ్ విజువల్స్, కొత్త బీజీఎమ్‌లు, కొన్ని ఎమోషనల్ ఎక్స్‌టెన్షన్ సన్నివేశాలు కూడా ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి.

Exit mobile version