Site icon NTV Telugu

Baahubali Crown of Blood : ఓటీటీలోకి వచ్చేసిన బాహుబలి యానిమటెడ్ వెర్షన్..

Whatsapp Image 2024 05 17 At 11.13.50 Am

Whatsapp Image 2024 05 17 At 11.13.50 Am

Baahubali Crown of Blood : రెబల్ స్టార్ ప్రభాస్ ను బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ గా మార్చిన సినిమా బాహుబలి.దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీలో ప్రభాస్ సరసన అనుష్క ,తమన్నా హీరోయిన్స్ గా నటించారు.రానా దగ్గుబాటి విలన్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు.ఇక ఈ సినిమాలో సత్యరాజ్‌, నాజర్‌, రమ్యకృష్ణ, వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.గ్లోబల్ వైడ్ గా ఈ సినిమా సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు.ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు.

బాహుబలికి సీక్వెల్ గా వచ్చిన బాహుబలి 2 సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధించింది.ఇదిలా ఉంటే గ్లోబల్ బాక్సాఫీస్‌ వద్ద తెలుగు సినిమా సత్తా చాటిన బాహుబలి ఇప్పుడు మరో రూపంలో సందడి చేసేందుకు సిద్ధం అయింది.దర్శకుడు రాజమౌళి రీసెంట్ గా ఎంతో గ్రాండ్ గా అనౌన్స్ చేసిన బాహుబలి యానిమేటెడ్‌ వెర్షన్‌ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. హాట్‌స్టార్‌ స్పెషల్స్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన “బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్”ఇప్పుడు డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆర్కా మీడియా మీడియా వర్క్స్‌ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ నిర్మించిన బాహుబలి యానిమేటెడ్ వెర్షన్‌ ఇప్పుడు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version