Site icon NTV Telugu

Baa Baa Black Sheep : ఆసక్తికరంగా ‘బా బా బ్లాక్ షీప్’ మోషన్ పోస్టర్

Baa Baa

Baa Baa

న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగా ‘బా బా బ్లాక్ షీప్’ అనే చిత్రం రాబోతోంది. గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే వేట.. ముగ్గురి తెలివి తేటలు.. ఒక రోజులో జరిగే ఘటనలు.. ఓ ఆరుగురి ప్రయాణంతో ఈ సినిమా సాగనుందని అంటున్నారు. దోనెపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనెపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని , విష్ణు, కార్తికేయ, విస్మయ శ్రీ, మాళవి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read:Nani 34: నాని-సుజిత్ బ్యానర్ మారి, మొదలైంది!

దసరా సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కథ, కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ మేకర్స్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయించారు. ఓ ముగ్గురు చుట్టూ తిరిగే కథ అంతా కూడా ఒకే రోజులో జరుగుతుందని తెలుస్తోంది. ఈ ప్రయాణంలో వారికి ఎదురైన పరిస్థితులు, ఆ పరిస్థితుల్లోంచి పుట్టే కామెడీ, ఈ జర్నీలో జరిగే క్రైమ్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌కి కొత్త అనుభూతిని ఇచ్చేలా కనిపిస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. మిగతా వివరాలు మేకర్లు త్వరలో ప్రకటించనున్నారు.

Exit mobile version