NTV Telugu Site icon

Ayushmann Khurrana : ఆ హీరో భార్యకు తిరగబడ్డ క్యాన్సర్

Ayushmann Khurrana,tahira Kashyap

Ayushmann Khurrana,tahira Kashyap

డబ్బుతో కొనలేనిది ఏమైనా ఉందా అంటే అది ఆరోగ్యం మాత్రమే. ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రెటీలు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. ఇందులో క్యాన్సర్ బారిన పడిన వారి సంఖ్య ఎక్కువని చెప్పొచ్చు. కొంతమంది బయటకు చెప్పుకుంటున్నారు మరి కొంత మంది చెప్పుకోవడం లేదు. కానీ అన్ని వ్యాధులతో పోల్చితే క్యాన్సర్ వ్యాధి మాత్రం మనిషిని మానసికంగా చంపేస్తుంది. దీని బారిన పడ్డారు.. అని తెలిసి భయంతోనే ధైర్యం కోల్పోతారు. ఇక రీసెంట్‌గా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా సతీమణి తహీరా కశ్యప్‌ మరోసారి రొమ్ము క్యాన్సర్‌ బారినపడ్డారు. తాజాగా హెల్త్ డే సందర్భంగా ఆమె ఈ విషయాన్ని బయటపెట్టుతూ.. ‘ ఆనారోగ్య సమస్య కలిగినప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్లాలంటూ సందేశం ఇచ్చారు.

Also Read: Rishab Shetty : ప్రమాదంలో రిషబ్ శెట్టి కుటుంబం.. దెబ్బతీసే కుట్ర జరుగుతోంది !

2018 లో ఆమెకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చినట్లు నిర్దారణ అయింది. ఇక అప్పటినుంచి చికిత్సలో భాగంగా జరిగే ప్రతి చర్యనీ ఆమె సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తనలా క్యాన్నర్‌తో బాధ పడేవారికి ధైర్యాన్ని ఇస్తూనే ఉంది. అలా రీసెంట్‌గా తనకు మళ్ళి క్యాన్సర్ తిరడపడిందని, రెండోసారి క్యాన్సర్‌పై తాను యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఆమె తెలిపింది. ‘త్వరలో వ్యాధి నుంచి విముక్తి పొందుతాను.. కానీ ఈ సందర్భంగా ప్రజలకు నా నుండి ఓ విజ్ఞప్తి ప్రతి ఒక్కరూ తప్పకుండా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి’ అని ఆమె సూచించారు. ఇక ఆమె క్యాన్సర్ నుండి బయట పడాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. భార్య పెట్టిన పోస్ట్‌కు వెంటనే స్పందిస్తూ ‘మై హీరో’ అని కామెంట్‌ పెట్టారు ఆయుష్మాన్ ఖురానా.