Site icon NTV Telugu

తిరిగొస్తోన్న ‘చిన్నారి పెళ్లికూతురు’!

అప్పట్లో ఆమె ‘చిన్నారి పెళ్లికూతురు’! కానీ, ఇప్పుడు పెళ్లి కూతురు పెద్దదైపోయింది! ఎస్.. అవికా గోర్ ప్రస్తుతం బిగ్ స్క్రీన్ పై హీరోయిన్. సినిమాలు చేస్తూనే బుల్లితెర మీద సీరియల్స్ లోనూ కనిపిస్తోంది. అయితే, ప్రధానంగా వెండితెర మీదే అవికా దృష్టి పెట్టింది. అందుకే, ‘బాలికా వధూ’ సీజన్ టూలో టైటిల్ రోల్ చేయటం లేదట!
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ కి హిందీలో ఒరిజినల్ వర్షన్ ‘బాలికా వధూ’. అందులో అప్పట్లో ఆనందిగా అలరించింది అవికా గోర్. కానీ, త్వరలో ‘బాలికా వధూ 2’ స్టార్ట్ అవ్వనుండగా మన మాజీ చిన్నారి పెళ్లికూతురు మాత్రం సౌత్ లో కొన్ని సినిమాలతో బిజీగా ఉందట. ఆమె మేకర్స్ ఈసారి సీరియల్ లో ‘ఆనంది’గా శ్రేయా పటేల్ ని ఎంచుకున్నారు. అవికా గోర్ మాత్రం ‘బాలికా వధూ’ న్యూ సీజన్ లో మరో పాత్రలో కనిపిస్తుంది.
పాత సీరియల్ తాలూకూ కొత్త సీజన్ తో , సరికొత్త పాత్రలో కనిపిచంబోతోన్న అవికా గోర్ ఉత్సాహంగా ఉంది. ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకి వస్తానా అని ఎదురు చూస్తోంది, ఈ ఎక్స్ బాలికా వధూ! లెట్స్ విష్ హర్ ఆల్ ది బెస్ట్…

Exit mobile version